అల్లం టీతో ఆరోగ్యం.. ఉదయాన్నే తాగడం వలన ఎన్ని ప్రయోజనాలో..
Samatha
8 February 2026
చాలా మందికి ఉదయాన్నే టీ తాగడం అలాటు ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే కప్పు టీ తాగనిదే కొందరికి రోజే గడవనట్లు ఉంటుందని చెబుతుంటారు.
మార్నింగ్ టీ
ఇక టీలలో అనేక రకాలు ఉంటాయి. ముఖ్యంగా చాలా మంది అల్లం టీ ఇష్టంగా తాగుతారు. మరి ప్రతి రోజూ ఉదయాన్నే అల్లం టీ తాగడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.
టీ రకాలు
అల్లంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందువలన దీనిని వంటల్లోనే కాకుండా, ఆయుర్వేదం, ఔషధ తయారీలో కూడా ఎక్కువ ఉపయోగిస్తారు.
ఔషధ గుణాలు
ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేంటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలను శరీరానికి చాలా మేలు చేస్తాయి.
పోషకాలు
అందువలన ప్రతి రోజూ ఉదయం అల్లం టీ తాగడం వలన ఇది జీర్ణ ఎంజైమ్‌లను మెరుగు పరిచి, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.
జీర్ణ సమస్యలు
అంతే కాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన ఇది శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. రోగని నిరోధక శక్తిని పెంచుతుంది.
రోగనిరోధక శక్తి
ఎవరు అయితే రోజూ దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారో, వారికి ఇది వరం అని చెప్పాలి. అలాగే పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది.
దగ్గు, జలుబు
అంతే కాకుండా ప్రతి రోజూ అల్లం టీ తాగడం వలన ఇది, మార్నింగ్ సిక్ నెస్, వాంతులు, వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.