Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గుడ్ న్యూస్.. తెలంగాణలో ప్రతి మండలానికి ఓ ఇంటర్నేషనల్ స్కూల్..!

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులపై సీఎం రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అందులో భాగంగానే మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న తరువాత అక్కడి లాబీలో భట్టి మీడియా చిట్ చాట్‎లో మాట్లాడారు విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని స్పష్టం చేశారు.

Telangana: గుడ్ న్యూస్.. తెలంగాణలో ప్రతి మండలానికి ఓ ఇంటర్నేషనల్ స్కూల్..!
Rrepresentative Image
Follow us
Srikar T

|

Updated on: Jul 23, 2024 | 4:09 PM

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులపై సీఎం రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అందులో భాగంగానే మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న తరువాత అక్కడి లాబీలో భట్టి మీడియా చిట్ చాట్‎లో మాట్లాడారు విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. అలాగే అంగన్ వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీలలో విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతీ అంగన్ వాడీలలో విద్యాబోధనకు ఒక టీచర్‎ను నియమించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.

అయితే అందులో అంగన్వాడీ ఉద్యోగుల సపరేటు, 3 వరకు చెప్పే టీచర్లు సపరేటుగా నియమిస్తామన్నారు. ఈ అంశంపై గతంలో సీఎం రేవంత్ రెడ్డి మేధావులతో చర్చించారన్న సంగతి గుర్తు చేశారు. 4 నుంచి 12 వరకు సెమీ, రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ స్కూల్స్‎కు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్స్‎తో సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మండలానికి 3 చొప్పున సెమీ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొస్తామన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. మొన్న జరిగిన బాసర ఐఐఐటీ ఘటన దురదృష్టకరం అన్నారు. బాసరలో ఐఐటీలో మత్తు పదార్థాలు అదుబాటులోకి రావడాన్ని ఖండిస్తున్నానన్నారు. కేంద్ర బడ్జెట్‎లో ప్రాధాన్యత ఇవ్వాలని తాము అడిగామని.. కేంద్రం మొండి చెయ్యి చూపిందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..