స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై దుమ్ముదుమారం.. స్పందించిన మంత్రులు భట్టి, సీతక్క.. ఏమన్నారంటే..

ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వికలాంగులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై పలువురు మజీ బ్యూరోక్రాట్స్ కూడా తీవ్రంగా ఖండించారు. అయితే తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా స్పందించారు. స్మితా సబర్వాల్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరి అభిప్రాయాలను వాళ్లు పంచుకునే స్వేచ్ఛ ఉంటుందన్నారు. అది పూర్తిగా ఆవిడ వ్యక్తిగతమన్నారు. ఆ వ్యాఖ్యలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.

స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై దుమ్ముదుమారం.. స్పందించిన మంత్రులు భట్టి, సీతక్క.. ఏమన్నారంటే..
Smita Sabharwal
Follow us

|

Updated on: Jul 23, 2024 | 4:55 PM

ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వికలాంగులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై పలువురు మజీ బ్యూరోక్రాట్స్ కూడా తీవ్రంగా ఖండించారు. అయితే తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా స్పందించారు. స్మితా సబర్వాల్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరి అభిప్రాయాలను వాళ్లు పంచుకునే స్వేచ్ఛ ఉంటుందన్నారు. అది పూర్తిగా ఆవిడ వ్యక్తిగతమన్నారు. ఆ వ్యాఖ్యలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తమది ప్రజా ప్రభుత్వం అని.. ప్రతి విషయంలో ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరిస్తామన్నారు.

ఇదే క్రమంలో మంత్రి సీతక్క కూడా ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండించారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. దివ్యాంగులపై ఆమె చేసిన వ్యాఖ్యలు తగవన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు దివ్యాంగులను కించపరిచేలా ఉన్నాయన్నారు. స్మితా సబర్వాల్ ప్యూడల్ భావజాలాన్ని కలిగి ఉన్నారని ఆరోపించారు. అలాంటి ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలన్నారు. ఫిజికల్ ఫిట్ నెస్‎కు సివిల్ అధికారుల పనితీరుకు సంబంధం లేదన్నారు. ఫిట్ నెస్ అనేది దేవుడు ఇచ్చేదని, మానసిక అంగవైకల్యం ఉన్నవారికే ఇలాంటి ఆలోచనలు వస్తాయన్నారు. ప్రస్తుత సమాజంలో దివ్యాంగులు చాలా విభాగాల్లో అత్యున్నత స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..