CM Revanth: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది.. బడ్జెట్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష పూరితంగా వ్యవహరించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 18సార్లు తాము మంత్రుల బృందంతో కలిసి రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి సమస్యలు తీర్చాలని కేంద్ర మంత్రులను కోరినట్లు తెలిపారు. చాలా సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర సమస్యలపై వివరించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం ఆలోచన చేయడం లేదన్నారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష పూరితంగా వ్యవహరించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 18సార్లు తాము మంత్రుల బృందంతో కలిసి రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి సమస్యలు తీర్చాలని కేంద్ర మంత్రులను కోరినట్లు తెలిపారు. చాలా సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర సమస్యలపై వివరించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం ఆలోచన చేయడం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ప్రధాన మంత్రి మోదీని కలిసి రాష్ట్రానికి రావల్సిన నిధులపై వివరించామన్నారు. తమ రాష్ట్రంపట్ల పెద్దన్న పాత్ర పోషించమని కోరినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అనవసరమైన బేషజలకు తాముపోలేదన్నారు.
బీహార్, ఆంధ్రకి తప్ప ఎవరిని పట్టించుకోలేదన్నారు. ఇది కుర్చీ కాపాడుకోవడం కోసం పెట్టిన బడ్జెట్ లాగా ఉందన్నారు. ఏపీలో పోలవరం నిర్మాణనికి వేల కోట్లు ఇస్తామంటున్న కేంద్రప్రభుత్వం.. తమ ప్రాజెక్టులకు ఎందుకు నిధులు ఇవ్వరని ప్రశ్నించింది. కేంద్రంతో ఫ్రెండ్లిగా ఉండటం తమ చేతగాని తనం కాదన్నారు. వివక్ష లేకుండా తమ రాష్ట్రానికి రావల్సిన నిధులు కేటాయించాలన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించినట్టు కనిపిస్తోందన్నారు. మొదటి నుండే ప్రధాని తెలంగాణ పట్ల వ్యతిరేకత చూపిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రాకు మాత్రం అన్ని విధాలుగా నిధులు ఇచ్చారని తెలిపారు. అయితే దానికి తాము ఎలాంటి విమర్శలు చేయడంలేదన్నారు. అదే సందర్భంగా పునర్విభజన చట్టంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మద్దతు ఇచ్చే పార్టీలతో లాలూచీ పడిన బడ్జెట్ ఇది అని విమర్శించారు. తెలంగాణకు నిధులు కేటాయింపులో పూర్తిగా విఫలం అయినందుకు కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. రాష్ట్రానికి నిధులు తేనప్పుడు 8మంది బీజేపీ ఎంపీలు ఎందుకు ఉన్నట్లు అని ప్రశ్నించారు. బడ్జెట్‌ను మరోసారి సవరించి తెలంగాణకు నిధులు విడుదల చేయాలన్నారు. నిధులు విడుదల చేసేంత వరకూ కాంగ్రెస్ ఎంపీలు పోరాడుతూనే ఉంటారని స్పష్టం చేశారు. దీనికి ఎంఐఎం సహకరించాలని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..