Telangana: ప్రతిభ ఉన్నా లక్ష్మీ కటాక్షం లేదు.. జేఈఈలో ర్యాంకు వచ్చినా చదవలేని పరిస్థితి

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనే నాయక్‌ తండాకు చెందిన బదావత్‌ నాయక్ తండాకు చెందిన బదావత్ రాములు-సరోజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ వరకు చదువుకొని తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయపడుతున్నారు. మూడో కూతురు మధులత జేఈఈ మెయిన్‌లో ప్రతిభ కనబరిచి ఎస్టీ కేటగిరీలో...

Telangana: ప్రతిభ ఉన్నా లక్ష్మీ కటాక్షం లేదు.. జేఈఈలో ర్యాంకు వచ్చినా చదవలేని పరిస్థితి
Telangana
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Jul 23, 2024 | 1:56 PM

కొందరికి మంచి ప్రతిభ ఉంటుంది. బాగా చదువకోవాలని ఆశపడుతుంటారు. అయితే పరిస్థితులు మాత్రం అనుకూలించవు. దీంతో వారి ప్రతిభ అడవి కాచిన వెన్నెలలాగే మారుతుంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ యువతి ఐఐటీలో సీటు వచ్చినా చదువుకోలేని పరిస్థితి ఉంది. పైచదువులు చదువుకోవాలని ఆసక్తి ఉన్నా, ప్రతిభ ఉన్నా చదువుకోలేని పరిస్థితి వచ్చింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనే నాయక్‌ తండాకు చెందిన బదావత్‌ నాయక్ తండాకు చెందిన బదావత్ రాములు-సరోజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ వరకు చదువుకొని తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయపడుతున్నారు. మూడో కూతురు మధులత జేఈఈ మెయిన్‌లో ప్రతిభ కనబరిచి ఎస్టీ కేటగిరీలో 824వ ర్యాంక్ సాధించింది. ఆమెకు పాట్నా ఐఐటీలో సీటు లభించింది. అయితే రూ.3లక్షల ఫీజు చెల్లించలేని స్థితిలో ఇంట్లో సాదుకుంటున్న మేకల కాపరికికి వెళుతోంది.

ఈనెల 27వ తేదీలోపు ఈ ఫీజు చెల్లించాల్సి ఉంది. దాతలు సాయం చేస్తే గిరిజనబిడ్డకు ఉన్నత విద్య అభ్యసించే అవకాశం దక్కుతుందనీ తల్లిదండ్రులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఆదుకొని పై చదులకు సహాయం చేయాలని వేడుకుంటున్నారు. అసలే మారుమూల ప్రాంతం జిల్లాకు 35 కిలోమీటర్లకు పైగా దూరం, కనీస వసతులు లేని ఒక గిరిజన తండా గ్రామం. రెక్కడితేగాని డొక్కాడని కుటుంబంలో ముగ్గురు ఆడబిడ్డలు అయిన పెంచి పెద్దచేశాడు ఆ తండ్రి.

Jee Rank

పేదరికం అడ్డు వస్తున్న రెక్కల కష్టంతో ముగ్గురునీ డిగ్రీ వరకు చదివించాడు. చిన్న కూతురు చదువులో మంచి ప్రతిభ కనబరిచినా పేదరికం అడ్డువస్తుంది. ఎంతో కష్టపడి డిగ్రీ వరకు చదివి ఉన్నత చదువులు చదవాలన్న సంకల్పంతో పై చదువులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంకుతో అర్హత సాధించిన నేపథ్యంలో కటిక పేదరికంతో ఫీజు కట్టలేక మేకల కాపరిగా మారింది. ఎవరన్నా దాతల సహకారంతో పై చదువులు చదవాలని ఆశతో ఎదురు చూస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..