మేడం అయితే.. సార్ ఫోన్ చేశారేంటి..? అనుమానంతో ఆరా తీయగా.. పె..ద్ద.. కథే..
సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు.. ఆఫీసర్ల పేర్ల చెప్పి డబ్బులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.. సదాశివపేట మున్సిపల్ కమిషనర్ పేరుతో పట్టణ వాసులకు ఫోన్ చేసి డబ్బులు అడిగారు.. అయితే.. ఇక్కడో ట్విస్ట్ అసలు గుట్టును బయటపెట్టింది.. సదాశివపేట మున్సిపల్ కమిషనర్ మహిళ ఉండగా.. పురుషుడు ఫోన్ చేయడంతో అసలు విషయం బయటపడింది..

సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు.. ఆఫీసర్ల పేర్ల చెప్పి డబ్బులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.. సదాశివపేట మున్సిపల్ కమిషనర్ పేరుతో పట్టణ వాసులకు ఫోన్ చేసి డబ్బులు అడిగారు.. అయితే.. ఇక్కడో ట్విస్ట్ అసలు గుట్టును బయటపెట్టింది.. సదాశివపేట మున్సిపల్ కమిషనర్ మహిళ ఉండగా.. పురుషుడు ఫోన్ చేయడంతో అసలు విషయం బయటపడింది.. వివరాల్లోకి వెళ్తే.. నిన్న మొన్నటివరకు మీరు ఇంటి దగ్గరే ఉండండి డబ్బులు మేము ఇస్తామంటూ మోసాలకు తెరలేపిన సైబర్ నెరగాళ్లు.. వాటిపై ప్రజల్లో అవగాహన కలగగానే ప్రస్తుతం తమ పంథాను మార్చారు.. కొత్త కొత్త ఆలోచనలతో మోసం చేయడమే వృత్తిగా పెట్టుకుని.. పూటకో మోసానికి తెరలేపుతున్నారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి నెలలు కావడంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు సైబర్ మోసగాళ్లు.. ఇందుకోసం ఏకంగా మున్సిపల్ కమిషనర్ల పేరుతో సామాన్యులను టార్గెట్ చేస్తున్నారు..
తాజాగా.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో పలువురు ప్రముఖులకు సైబర్ నేరగాళ్లు తాము సదాశివపేట మున్సిపల్ కమిషనర్ అని మాట్లాడారు.. ఇయర్ ఎండ్ అని.. పన్నుల పేరుతో మభ్యపెట్టబోయారు.. తాము పంపిన ఫోన్ నెంబర్లకు గూగుల్ పే, కానీ వాట్సాప్ కానీ చేసి తమ బకాయలు చెల్లించాలని పలు నంబర్లతో పలుసార్లు ఫోన్లు చేశారు..
తాను సదాశివపేట మున్సిపల్ కమిషనర్ ను మాట్లాడుతున్నానంటూ ఫోన్ పలువురికి ఫోన్లు పోయాయి.. కొంతమంది షాప్‌ల యజమానులకు ఫోన్ చేసి.. లైసెన్సులు రెన్యువల్ చేసుకోలేదని.. అలాగే కొంతమంది మిషన్ భగీరథ పన్నులు చెల్లించలేదని వాటన్నిటిని త్వరగా.. ఇప్పుడు చెప్పిన ఫోన్ నెంబర్ కు .. జీపే కాని గూగుల్ పే కానీ చేయాలని సూచించారు. లేదంటే జరిమానా విధించి వారికి నోటీసులు ఇస్తామని.. అటువంటి వారిని ఫ్లెక్సీల్లో ఫొటోలు వేసి ప్రచారం చేస్తామని సైబర్ నేరగాళ్లు చెప్పడంతో కంగుతిన్నారు. పట్టణ ప్రజలు..
అయితే.. ఇక్కడో ట్విస్ట్ అసలు గుట్టును బయటపెట్టింది.. సదాశివపేట పట్టణ మున్సిపల్ కమిషనర్ మహిళ కావడంతో అనుమానం వచ్చిన కొందరు వ్యక్తులు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా తాము ఎవరికీ ఫోన్ చేయలేదని అటువంటి కాల్స్ కి ఎవరు రెస్పాండ్ కావద్దని సదాశివపేట మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి ప్రజలకు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..