Hyderabad: హైదరాబాద్‌లోకి ఆ పార్క్ చుట్టూ 152 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా.. ఎందుకంటే..?
కేబీఆర్ పార్క్ ముందు కాల్పులు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ఏడు సంవత్సరాల క్రితం ఒక ఫార్మా కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ పై కాల్పులకు తెగబడ్డాడు నిందితుడు. బడా బాబుల నుండి దోచుకునేందుకు ఇదొక మార్గంగా ఎంచుకున్నారు. ఆ ఘటన తరువాత కెబిఆర్ పార్క్ భద్రతపై అనేక అనుమానాలు, విమర్శలు తలెత్తాయి. దీంతో పార్కు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అప్పటి పోలీసులు.

హైదరాబాద్‌లో హై ప్రొఫైల్ పార్క్‌గా KBR పార్క్‌కు పేరుంది. ఉదయం సాయంత్రం సమయాల్లో ఇక్కడ వాకింగ్ చేసేందుకు విఐపీలు, నాయకులు, సెలబ్రిటీలు, బిజినెస్ మేన్, డాక్టర్స్, సాఫ్ట్వేర్‌లు వస్తూ ఉంటారు. నగరం మొత్తంలో ఈ స్థాయిలో హై ప్రొఫైల్ పార్క్ మరోటి లేదు. ఈ రేంజ్‌లో ట్రాక్ ఉన్న పార్క్ కూడా మరోటి లేదు. సో మామూలుగానే దీనికి సందర్శకుల తాకిడి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇదే నేరస్థుల పాలిటి వేదిక అయ్యింది. పెద్ద పెద్ద కార్లు, బడా బిజినెస్ మెస్, సినిమా హీరోయిన్లు ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. కొంత మంది పార్క్ లోపల వాక్ చేస్తే మరీ కొంత మంది పార్క్ బయట వాక్ చేస్తారు. పార్క్ బయట కార్ల పార్కింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదే సెలబ్రిటీస్‌కు తలనొప్పిగా మారింది.
గతంలో పార్క్ గేట్ బయట కాల్పులు
ఇదే కేబీఆర్ పార్క్ ముందు కాల్పులు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ఏడు సంవత్సరాల క్రితం ఒక ఫార్మా కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ పై కాల్పులకు తెగబడ్డాడు నిందితుడు. బడా బాబుల నుండి దోచుకునేందుకు ఇదొక మార్గంగా ఎంచుకున్నారు. ఆ ఘటన తరువాత కెబిఆర్ పార్క్ భద్రతపై అనేక అనుమానాలు, విమర్శలు తలెత్తాయి. దీంతో పార్కు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అప్పటి పోలీసులు. అంత బానే ఉన్నా 3 సంవత్సరాల తరువాత సీసీ కెమెరాల మెయింటెనెన్స్ సరిగ్గా లేక అవి మొరయించడం మొదలు పెట్టాయి. ఇప్పుడు మళ్లీ అదే పార్క్ పరిసరాల్లో అనేక రకాల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాటికి చెక్ పెడతాం అంటున్నారు నగర పోలీసులు.




కొన్ని రోజుల క్రితం సినీ నిర్మాతకు వేధింపులు
రెండు రోజులు క్రితం ఇదే కేబిఆర్ పార్క్ పరిసరాల్లో మరో ఘటన చోటుచేసుకుంది. సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక యువతితో పార్క్ బయట ఒకడు అసభ్యంగా ప్రవర్తించాడు. వాకింగ్ చేస్తున్న యువతి చూస్తుండంగా వింత చేష్టలు చేశాడు. అతనిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. ఇక్బాల్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు బంజారా హిల్స్ పోలీసులు.
152 కెమెరాలతో పార్క్ చుట్టూ నిరంతర నిఘా – సివీ ఆనంద్
దీంతో మరోసారి కేబీఆర్ పార్క్ సీసీ కెమెరాలపై ప్రశ్న తలెత్తింది. కమ్యూనిటీ సీసీ కెమెరాల్లో భాగంగా వరకు చుట్టూ 152 కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎప్పటికప్పుడు వీటి మెయింటెనెన్స్ బాధ్యత చూసుకునేందుకు జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ ఆధ్వర్యంలో (CAMO) కెమెరాస్ మానిటరింగ్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాస్ కోసం రెయిన్‌బో హాస్పిటల్ 20 లక్షల రూపాయలు, ఒమేగా హాస్పిటల్ 10 లక్షలు విరాళాలు ఇచ్చారు.
KBR పార్క్ తమకెంతో ప్రధానం అన్నారు హైదరాబాద్ సీపీ సివి ఆనంద్. విఐపి జోన్లో ఉండటంతో ఇక్కడ ఏం జరిగినా చాలా డామేజ్ చేస్తుందని ఆయన తెలిపారు. అందుకే ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవడం తమకు టాప్ ప్రియారిటీ అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
