Telangana Politics: జహీరాబాద్ నియోజకవర్గంలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్స్.. అయిన పట్టించుకోని సీనియర్ లీడర్..
ZAHEERABAD NEWS: కాంగ్రెస్స్ పార్టీకి కంచుకోటలా ఉండేదట..తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అక్కడ కాంగ్రెస్స్ పార్టీనే గెలిచిందట.. కానీ ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి మాత్రం దారుణంగ మారిందట..మెల్లిమెల్లిగా, ఒక్కొక్కరు హస్తం పార్టీకి హ్యాండ్ ఇస్తున్నారట..ఇంత జరుగుతున్న కూడా అక్కడ ఉండే సినియసర్ లీడర్ మాత్రము పట్టించుకోవడం లేదట..ఇంతకీ ఆనియోజక వర్గం ఎక్కడ..? పార్టీని పట్టించుకోని ఆ సీనియర్ లీడర్ ఎవరు..?
జహీరాబాద్, జూలై 18: జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్స్ పార్టీకి కంచుకోట.. తెలంగాణ ఉద్యమ సమయంలో కావొచ్చు.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కావోచ్చు ఈ పార్టీ హవా మాత్రం ఇక్కడ తగ్గలేదు..కానీ ఇప్పుడు మాత్రం ఆ పార్టీకి అంత సీన్ లేదు అని అంటున్నారట ఆ పార్టీకి చెందిన కార్యకర్తలే… నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్స్ పార్టీకి ఇప్పటికి డై హార్ట్ ఫాన్స్ ఉన్నారట…కానీ వారిని ముందుకు నడిపే లీడర్లు మాత్రం లేరట.. 2018లో ఇక్కడ కాంగ్రెస్స్ పార్టీ ఓటమికి గురైంది..అయిన కూడా పార్టీ క్యాడర్ బలంగా ఉందట..కానీ లీడర్లు మాత్రం వేరే పార్టీలోకి వెళ్లిపోతు ఉండడంతో క్యాడర్ మొత్తం నైమిశారణ్యంలోకి వెళ్తున్నారట..ఇటీవలి కాలంలో కాంగ్రెస్స్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్లు చాలామంది.. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారట.. మొన్నటికి మొన్న జహీరాబాద్ నియోజకవర్గంలో సీనియర్ లీడర్ గా ఉన్న నరోత్తం.. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది ఆ పార్టీకి తీరనిలోటు అని అంటున్నారాట రాజకీయ విశ్లేషకులు..
నరోత్తంతో పాటు ఇంకా చాలా మంది లీడర్లు పార్టీని విడిపోయారట..దీనితో నియోజకవర్గ స్థాయిలో పార్టీని నడిపే లీడర్లు ఎవరు లేరట.. అయితే నియోజకవర్గ పరిధిలో ఇంత జరుగుతున్న కూడా పార్టీలో ఉన్న సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే గీతారెడ్డి మాత్రం అసలు పట్టించు కోవడం లేదట..పార్టీ నుండి వలసలు పెరుగుతున్న కూడా గీతారెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో ఎవరికి అంతు పట్టడం లేదట..ఇటీవలి కాలంలో గీతారెడ్డి కూడా నియోజకవర్గ పరిధిలో ఎక్కడ కూడా ఎక్కువగా పర్యటనలు చేయడం లేదట..గీతారెడ్డి సైలెంట్ వెనుక ఏమైనా వ్యూహం ఉందా..లేదా కావాలనే ఇలా ఉంటుందా అనే అనుమానాలు వస్తున్నాయట..
గీతారెడ్డి 2009,2014లో జహీరాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలించింది..కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ నియొజకవర్గం నుండి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మానిక్ రావు చేతిలో ఓడిపోయింది.. ఆ తర్వాత కూడా నియోజక వర్గం పై సీరియస్ గానే దృష్టి సారించారట..కానీ ఇటివలే కాలంలో మాత్రం పెద్దగా దృష్టి సారించడం లేదు అనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి..నరోత్తం లాంటి సీనియర్ నేత కాంగ్రెస్స్ పార్టీని వీడిన కూడా.. ఎందుకు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు అనేది ఇక్కడ ఎవరికి అర్ధం కావడం లేదట..
మరో వైపు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కూడా గీతారెడ్డి లాంటి సీనియర్ లీడర్ పార్టీని పట్టించుకోకుండా ఉంటే ప్రమాదమే అని అంటున్నారు సీనియర్ లీడర్లు…మరో వైపు పార్టీ మరీనా నరోత్తంకి,గీతారెడ్డి కి మొదటి నుండి పడదు అని, అందుకు అతను పార్టీ మరీనా కూడా పెద్దగా రెస్పాన్స్ కాలేదు అనేది ఓ చర్చ..
దీనికి తోడు ఈసారి గీతారెడ్డి జహీరాబాద్ నుండి కాకుండా కంటోన్మెంట్ నుండి పోటీ చేయాలని చూస్తుంది అని అందుకే ఇక్కడ ఎక్కువ దృష్టి సారించడం లేదు అనే చర్చ కూడా నడుస్తోంది.. ఈ ప్రచారం తెరమీదకు రాగానే పక్క జిల్లాలు,పక్క నియోజకవర్గ నేతలు జహీరాబాద్ నియోజకవర్గం పై దృష్టి సారించారట..ఏది ఏమైనా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో హస్తం పార్టీకి ఫుల్ క్యాడర్ ఉన్న వారిని పట్టించుకునే లీడర్ లేకపోవడం అనేది ఆ పార్టీకి నష్టమే అని,ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్ ఇబ్బందులు తప్పవు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం