AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: కరోనా ఎఫెక్ట్.. తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు.. స్క్రీనింగ్ పరీక్షల్లో నెగెటివ్ వస్తేనే రాష్ట్రంలోకి ఎంట్రీ..

TS border-Karnataka: కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండడమేకాదు.. ఒమిక్రాన్ కేసులు కూడా నమోదవుతున్నాయి. దీంతో సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి..

Corona Virus: కరోనా ఎఫెక్ట్.. తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు.. స్క్రీనింగ్ పరీక్షల్లో నెగెటివ్ వస్తేనే రాష్ట్రంలోకి ఎంట్రీ..
Check Post On Karnataka Ts
Surya Kala
|

Updated on: Jan 09, 2022 | 11:26 AM

Share

TS border-Karnataka: కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండడమేకాదు.. ఒమిక్రాన్ కేసులు కూడా నమోదవుతున్నాయి. దీంతో సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సనాగరెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం హస్సెల్లి గ్రామంలో  పాటు జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి గ్రామ శివారులో చెక్ పోస్టు ఏర్పాటు చేశారు.  సరిహద్దు దాటుతున్న వ్యక్తులకు స్క్రీన్ టెస్టులు నిర్వహించేందుకు చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్టుల వ‌ద్ద 24 గంట‌ల పాటు పోలీసులు అందుబాటులో ఉండ‌నున్నారు.

జహీరాబాద్ బీదర్ రోడ్డుపై రాష్ట్ర సరిహద్దులో ఉన్న గణేష్‌పూర్ శివారులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే ప్రయాణికుల‌కు కొవిడ్ ప‌రీక్షలు నిర్వహిస్తున్నారు. ఎస్ఐ స్థాయి అధికారితో పాటు పోలీసులు వైద్యాధికారి వైద్య సిబ్బంది ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ ఉన్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరాదని ప్రభుత్వం ఆదేశాలతో .. నెగిటివ్ రిపోర్టు వ‌స్తేనే రాష్ట్రంలోకి వారిని అనుమ‌తిస్తున్నారు. ప్రతి ఒక్క వాహనాన్ని అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.

బీదర్‌లో  కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధించారు. దీంతో సంగారెడ్డి జిల్లా అధికారులు మీర్జాపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తున్నవారికి స్క్రీన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశంలో మళ్ళీ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో.. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుంది.

Also Read:

 సీఎం ఇంట్లో కరోనా కలకలం.. భార్య , పిల్లలు సహా 15 మందికి పాజిటివ్..

India Covid-19: కరోనా విలయతాండవం.. దేశంలో లక్షన్నర మార్క్ దాటిన కేసులు..

ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..