Telangana: కానిస్టేబుల్, ఎస్సై మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయ్.. అప్పటి నుంచే పరీక్షలు..

అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రిలిమ్స్, దేహధారుడ్య పరీక్షలు రాసి.. మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కీలక ప్రకటన ఇచ్చింది. మార్చి 12, 2023 నుంచి తుది పరీక్షలు ఉంటాయని..

Telangana: కానిస్టేబుల్, ఎస్సై మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయ్.. అప్పటి నుంచే పరీక్షలు..
Constable
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 01, 2023 | 12:24 PM

అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రిలిమ్స్, దేహధారుడ్య పరీక్షలు రాసి.. మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కీలక ప్రకటన ఇచ్చింది. మార్చి 12, 2023 నుంచి తుది పరీక్షలు ఉంటాయని టీఎస్ఎల్పీఆర్బీ ప్రకటించింది. ఏప్రిల్ 9 న సివిల్ ఎస్సై మెయిన్స్, ఏప్రిల్ 23న అన్ని రకాల కానిస్టేబుల్ పోస్టులకు తుది పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు పేపర్ – 1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్ -2 పరీక్ష ఉంటుందని తెలిపింది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను చూడాలని సూచించింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు శారీరక సామర్థ, దేహదారుఢ్య పరీక్షలు శనివారం ముగిశాయి.

మరోవైపు.. నియామక ప్రక్రియకు సంబంధించి ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లో ‘చలో డీజీపీ కార్యాలయం’ కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థి, యువజన సమాఖ్య ప్రతినిధులు డీజీపీ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం