మహబూబాబాద్ జిల్లాలో ఘోరం.. లారీ నుంచి ఆటోపై పడిన గ్రానైట్ రాయి.. నలుగురు దుర్మరణం..

మహబూబాబాద్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. లారీలో ఉన్న గ్రానైట్ రాయి ఆటోపై పడటంతో నలుగురు కూలీలు మృతి చెందారు.

మహబూబాబాద్ జిల్లాలో ఘోరం.. లారీ నుంచి ఆటోపై పడిన గ్రానైట్ రాయి.. నలుగురు దుర్మరణం..
Road Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 31, 2022 | 9:27 PM

ఘోరం చోటుచేసుకుంది. కూలి పనికి వెళ్లి.. తిరిగి ఇంటికి చేరుకుంటున్న కూలీలు గ్రానైట్‌ బండ కింద సమిధలయ్యారు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల పోలీస్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.  లారీ నుంచి గ్రానైట్‌ రాయి జారి.. పక్కనే వెళ్తున్న ఆటోపై పడిపోయింది. ఆ గ్రానైట్‌ రాయి దెబ్బకు ఆటో నుజ్జునుజ్జు కాగా.. నలుగురు మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఆటోలో పది మంది ప్రయాణిస్తున్నారు. డ్రైవర్‌తో కలిపి 11 మంది ఉన్నారు. నలుగురు స్పాట్‌లో చనిపోయారు. గ్రానైట్‌ రాయి కింద పడి నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. మిగతావారికి కూడా గాయాలయ్యాయి. సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గ్రానైట్ లారీ డ్రైవర్ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కూలీ పనులు చేసి ఆటోలో ఇళ్లకు వెళ్తుండగా.. అటుగా వెళ్తున్న లారీ నుంచి గ్రానైట్ రాయి జారిపడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మృతులు మరిపెడ మండలం, మంగోరిగూడెం గ్రామస్థులుగా పోలీసులు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా లేకుండా గ్రానైట్ తరలించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!