TS Govt Jobs 2023: తెలంగాణ ఎస్సీ గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి.
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ గురుకుల మహిళా 'లా' కాలేజీలు, గిరిజన గురుకుల పురుషుల 'లా' కాలేజీల్లో గెస్ట్ అధ్యాపకుల పోస్టులతోపాటు ఇతర ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది..
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ గురుకుల మహిళా ‘లా’ కాలేజీలు, గిరిజన గురుకుల పురుషుల ‘లా’ కాలేజీల్లో గెస్ట్ అధ్యాపకుల పోస్టులతోపాటు ఇతర ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌రాస్ ఓ ప్రకటనలో తెలిపారు. న్యాయ విభాగంలో 4, లైబ్రేరియన్ విభాగంలో 2, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, చరిత్ర, సోషియాలజీ విభాగాల్లో ఒక్కొక్కటి చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
ఆసక్తి, అర్హత కలిగిన వారు జనవరి 7 సాయంత్రం 5 గంటల్లోగా సంక్షేమభవన్, మాసాబ్‌ట్యాంకు, హైదరాబాద్‌లో తమ అప్లికేషన్లను ఆఫ్‌లైన్ మోడ్‌లో అందజేయాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.