Telangana Jobs: తెలంగాణలో కొనసాగుతున్న ఉద్యోగాల జాతర.. టీఎస్‌పీఎస్సీ నుంచి మరో 3 నోటిఫికేషన్లు..

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్‌పిఎస్‌సి.. తాజాగా మరో 3 నోటిఫికేషన్లు జారీ చేసింది. కాలేజీ ఎడ్యూకేషన్‌లో..

Telangana Jobs: తెలంగాణలో కొనసాగుతున్న ఉద్యోగాల జాతర.. టీఎస్‌పీఎస్సీ నుంచి మరో 3 నోటిఫికేషన్లు..
Tspsc
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 31, 2022 | 7:58 PM

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్‌పిఎస్‌సి.. తాజాగా మరో 3 నోటిఫికేషన్లు జారీ చేసింది. కాలేజీ ఎడ్యూకేషన్‌లో 544 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది టీఎస్‌పిఎస్‌సి. అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఫిజికల్ డైరెక్టర్స్, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత గల అభ్యర్థు జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇక మున్సిపల్ శాఖలో 78 పోస్టులకు మరో నోఫికేషన్ విడుదల చేసింది టీఎస్‌పిఎస్సీ. సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఇంటర్, సాంకేతిక విద్యలో 71 పోస్టులకు మరో నోటిఫికేషన్ విడుదలైంది. లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. వీటి దరఖాస్తులు జనవరి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. దరఖాస్తులకు చివరి తేదీ 10గా ప్రకటించింది టీఎస్‌పీఎస్‌సీ. కాగా, ఇప్పటికే గ్రూప్ 4, గ్రూప్ 4, వైద్యారోగ్యశాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ.. తాజాగా మరో 3 విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఉద్యోగ సంబంధిత సమాచారం ఈ లింక్ క్లిక్ చేయండి..