2023 Celebration: అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు.. పోలీసుల బందోబస్తు
2022 సంవత్సరానికి వీడ్కోలో పలికి 2023 సంవత్సరానికి స్వాగతం పలికారు ప్రజలు. నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ దీపాలతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు..
2022 సంవత్సరానికి వీడ్కోలో పలికి 2023 సంవత్సరానికి స్వాగతం పలికారు ప్రజలు. నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ దీపాలతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. అలాగే భారీ ఎత్తున టపాసులు, యువత కేరింతల మధ్య ఈ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు ఆకాశన్నంటాయి. ఒకరినొకరు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు తదితర నగరాలు విద్యుత్ దీపాలతో మెరిసిపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో సందడి
ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో సైతం వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్నారులు, పెద్దలు అర్ధరాత్రి కాగానే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ వేడుకలు జరుపుకొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్‌పై నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీలో కొత్త సంవత్సర వేడుకలు
ఢిల్లీలో అతిపెద్ద నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున జనం గుమిగూడడంతో పోలీసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొత్త సంవత్సర వేడుకల కోసం కన్నాట్ ప్లేస్‌లోని హోటల్-రెస్టారెంట్‌లను భారీగా అలంకరించారు. సాయంత్రం నుంచే అక్కడ రద్దీ పెరగడం మొదలైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.