AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జర్నలిస్టుల పిల్లలకు ఏటా రూ. 5లక్షల స్కాలర్‌షిప్స్.. ప్రకటించిన మంత్రి హరీష్ రావు..

Telangana: జీవితాను పణంగా పెట్టి, సమాజం కోసం అహర్నిషలు కష్టపడుతున్న జర్నలిస్టులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. శనివారం నాడు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో..

Telangana: జర్నలిస్టుల పిల్లలకు ఏటా రూ. 5లక్షల స్కాలర్‌షిప్స్.. ప్రకటించిన మంత్రి హరీష్ రావు..
Telangana Minister Harish Rao
Shiva Prajapati
|

Updated on: Dec 31, 2022 | 9:58 PM

Share

జీవితాను పణంగా పెట్టి, సమాజం కోసం అహర్నిషలు కష్టపడుతున్న జర్నలిస్టులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. శనివారం నాడు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టు స్కాలర్ షిప్స్ పంపిణీ, నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. స్కాలర్ షిప్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. జర్నలిస్టులు ఛాలెంజ్‌గా పని చేస్తారని కొనియాడారు. పండుగలు, సెలవులు సైతం వదులుకొని పని చేస్తుంటారని అన్నారు. ఎంతో కష్టపడి సమాజం కోసం పని చేస్తుంటారని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తారని, జర్నలిజం ఒక గొప్ప వృత్తి అని కొనియాడారు. జర్నలిస్టులు నిత్యం అప్‌డేట్ అవుతూ ఉండాల్సిన అవసరం ఉంటుందన్నారు.

జర్నలిస్టుల సంక్షేమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, ఇందులో భాగంగానే జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు చేశారని తెలిపారు మంత్రి హరీష్ రావు. గతంలో ఎన్నడు లేనివిధంగా 20వేలకు పైగా అక్రిడేషన్లు మంజూరు చేశారన్నారు. ఇందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. జర్నలిస్టుల ఇళ్ళ అంశం ముందుకు వెళ్తోందని, త్వరగా పరిష్కారం అయ్యేలా తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కాగా, బాలలత రూ. 5 లక్షలలతో స్కాలర్ షిప్స్ ఇస్తున్నారని, ఇక నుంచి తాను కూడా ప్రతి ఏటా రూ. 5 లక్షలు జర్నలిస్టుల పిల్లలకు స్కాలర్ షిప్స్ ఇచ్చేందుకు తోడ్పాటునందిస్తానని ప్రకటించారు హరీష్ రావు.

1071 మంది తెలంగాణ పిల్లలు నేడు ఎంబీబీఎస్ అడ్మిషన్లు పొందారు అంటే గొప్ప విషయం అని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. ఇందులో జర్నలిస్టుల పిల్లలు కూడా ఉన్నారని, ఇది చాలా సంతోషకరం అన్నారు. ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని, పీజీ స్థానాల్లో 2 వ స్ధానం, దేశంలో ఆరోగ్య రంగంలో తెలంగాణ 3వ స్థానములో ఉందన్నారు ఉద్యమ సమయంలో జర్నలిస్టులు అందించిన సహకారాన్ని తాము మర్చిపోలేమన్నారు. జర్నలిస్టుల కష్టాలు తీర్చడంలో ముందుంటామని, అన్ని విధాలుగా అండగా ఉంటానని మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..