Komatireddy Rajagopal Reddy: అలా అయితే, ఎమ్మెల్యే పదవికి పోటీ చేయను.. సంచలన వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి !

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.

Komatireddy Rajagopal Reddy: అలా అయితే, ఎమ్మెల్యే పదవికి పోటీ చేయను.. సంచలన వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి !
Komatireddy Rajagopal Reddy
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 14, 2021 | 4:55 PM

MLA Komatireddy Rajagopal Reddy Comments: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తే ఎమ్మెల్యే పదవికి పోటీ చేయనని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ సర్పంచ్ ఉన్న గ్రామాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేని శంకుస్థాపన చేయనీయడం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న దగ్గర మంత్రిని మునుగోడు నియోజకవవర్గంలో తిరగనీయమని హెచ్చరించారు. ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ వేల కోట్లు కుమ్మరించడం సీఎం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. ఇతర పార్టీ నేతలను ఎన్నికల్లో గెలవనీయకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.

ఇదిలావుంటే, ఆయన సోదరుడు భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇలాంటి సవాలే విసిరారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించి తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారారు. రాష్ట్రంలో పలు పనులకు సంబధించి కాంట్రాక్టర్లకు రూ. 1,350 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. హిట్లర్ బతికుంటే కేసీఆర్‌ను చూసి ఏడ్చేవాడని వెంకటరెడ్డి ఎద్దేవాచేశారు.

, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి రెండు వేల కోట్ల రూపాయ‌లు మంజూరు చేస్తే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డానికి సిద్దంగా ఉన్నట్లు ప్రక‌టించారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఖ‌ర్చు చేసే ప్రతి పైసా ప్రజ‌ల‌ సొమ్మేన‌ని చెప్పిన రాజాసింగ్.. ఈటల రాజేంద‌ర్ ప్రజాసేవ‌కుడ‌ని.. అత‌న్ని గెలిపించాల‌ని పిలుపునిచ్చారు.

Read Also…  Alert: బస్సులో విండ్ సీట్‌లో కూర్చుని చెయ్యి బయట పెట్టి ప్రయాణిస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త

అరంగేట్ర టెస్టులో సెంచరీ.. సచిన్ కంటే గొప్ప బ్యాట్స్‌మెన్‌గా పేరు.. కానీ, ఏడాదిలోనే కెరీర్ ఖతం.. ఆ టీమిండియా ప్లేయర్ ఎవరో తెలుసా?

NHRC: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్‌హెచ్చార్సీ ఆగ్రహం