అరంగేట్ర టెస్టులో సెంచరీ.. సచిన్ కంటే గొప్ప బ్యాట్స్‌మెన్‌గా పేరు.. కానీ, ఏడాదిలోనే కెరీర్ ఖతం.. ఆ టీమిండియా ప్లేయర్ ఎవరో తెలుసా?

ఈ ఆటగాడు తన చాలా తక్కువ కెరీర్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కానీ, అతను జట్టు నుంచి దూరమయ్యాడు. ఇప్పటివరకు బ్రేక్ చేయని అనేక రికార్డులను సృష్టించి తన పేరును భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా లిఖించుకున్నాడు.

అరంగేట్ర టెస్టులో సెంచరీ.. సచిన్ కంటే గొప్ప బ్యాట్స్‌మెన్‌గా పేరు.. కానీ, ఏడాదిలోనే కెరీర్ ఖతం.. ఆ టీమిండియా ప్లేయర్ ఎవరో తెలుసా?
సచిన్ టెండూల్కర్, ప్రవీణ్ ఆమ్రే, వినోద్ కాంబ్లి
Follow us

|

Updated on: Aug 14, 2021 | 4:15 PM

ఒక బ్యాట్స్‌మన్ తన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. అది కూడా విదేశీ గడ్డపై. దీని తరువాత అతని కెరీర్ కేవలం ఒక సంవత్సరంలోపే ముగిసిపోయింది. ఒక బ్యాట్స్‌మన్ తన మొదటి వన్డేలో అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం రెండున్నర సంవత్సరాలు మాత్రమే జట్టులో కొనసాగాడు. ఆ ప్లేయర్, సచిన్ టెండూల్కర్ ఒకే కోచ్ దగ్గర శిష్యులు కావడం విశేషం. అతడి బ్యాటింగ్‌తో ముగ్ధుడైన కోచ్.. సచిన్ కంటే పెద్ద బ్యాట్స్‌మన్‌ అవుతాడని, ఎక్కువకాలం క్రికెట్‌లో నిలబడతాడని పేర్కొన్నాడు. కానీ, అంచనాలు తప్పి.. కేవలం ఒక సంవత్సరం మాత్రమే క్రికెట్ ఆడి జట్టుకు దూరమయ్యాడు. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.. భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే. ఈరోజు ఆయన పుట్టినరోజు. ముంబై క్రికెట్ నుంచి బయటకు వచ్చిన ఆమ్రే, అతడి కాలంలో అత్యంత సమర్థులైన, ప్రతిభావంతులైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Pravin Amre 1

1992-93 దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రవిన్ ఆమ్రే టీమిండియా తరపున తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. డర్బన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం టెస్టులో సెంచరీ సాధించిన తొమ్మిదో భారత బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. ప్రవీణ్ ఆమ్రే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. అతను ఆరవ నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగి తన మొదటి సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆయన 103 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అలాన్ డోనాల్డ్, బ్రియాన్ మెక్‌మిలన్, మెరిక్ ప్రింగిల్ వంటి దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని ఈ ఇన్నింగ్స్ ఆడాడు. ఆమ్రే సెంచరీ కారణంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ముందంజంలో నిలిచింది. అతను 11 టెస్టులు మాత్రమే ఆడాడు. 42.50 సగటుతో 425 పరుగులు సాధించాడు. ఆయన పేరుపై మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి. అయితే, అతను జట్టు నుంచి దూరమయ్యాడు. అతను నవంబర్ 1992లో తన తొలి టెస్ట్ ఆడాడు. అలాగే ఆగస్టు 1993లో తన చివరి మ్యాచ్ ఆడాడు. అంటే, 10 నెలల్లోనే అతడి టెస్ట్ కెరీర్ ముగిసింది.

Pravin Amre 3

ప్రవీణ్ ఆమ్రే ఒక స్టైలిష్ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లి లాగానే, అతను రమాకాంత్ అచ్రేకర్ నుంచి క్రికెట్ నైపుణ్యాలను నేర్చుకున్నాడు. ఆమ్రే 1986-87లో ఒకే సీజన్‌లో ముంబై కోసం క్రికెట్ ఆడాడు. అప్పుడు అతను రైల్వేస్, రాజస్థాన్, బెంగాల్ టీంలతో ఆడాడు. అతను దేశీయ క్రికెట్‌లో అనేక పరుగులు సాధించాడు. ఇరానీ ట్రోఫీలో రెస్ట్ ఆఫ్ ఇండియా తరపున ఆడిన ప్రవీణ్ ఆమ్రే 246 పరుగులు సాధించాడు. ఇరానీ ట్రోఫీలో ఏ బ్యాట్స్‌మన్ సాధించిన అత్యధిక స్కోరు సాధించాడు. ఈ బ్యాట్స్‌మన్ దులీప్, రంజీ ట్రోఫీలో చాలా పెద్ద స్కోర్లు చేశాడు. 1989–90 దులీప్ ట్రోఫీలో, అతను మూడు మ్యాచ్‌లు ఆడాడు. 106, 240 నాటౌట్, 113 పరుగులు సాధించాడు. ఆమ్రే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 86 మ్యాచ్‌లు ఆడాడు. 48.86 సగటుతో 5815 పరుగులు సాధించాడు. అతడి పేరుపై 17 సెంచరీలు, 25 అర్ధసెంచరీలు ఉన్నాయి.

Pravin Amre 4

ప్రవీణ్ ఆమ్రే 1999–2000 సీజన్‌లో దక్షిణాఫ్రికా దేశీయ క్రికెట్‌లో ఆడాడు. ఇక్కడ అతను బోలాండ్ జట్టులో భాగస్వామ్యం అయ్యాడు. ఇక్కడ కూడా అతని పనితీరు అద్భుతంగా ఉంది. ఆమ్రే నవంబర్ 1991లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 74 బంతుల్లో 55 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాపై వన్డే కెరీర్‌లో అత్యధిక స్కోరు నమోదు చేశాడు. 1992లో అజేయంగా 84 పరుగులు సాధించి టీమిండియాకు విజయాన్ని అందించాడు. వన్డేల్లో, అతను 37 మ్యాచ్‌లు ఆడి 513 పరుగులు సాధించాడు. అతను చివరిసారిగా 1994లో భారతదేశం తరపున తన చివరి వన్డే ఆడాడు. ఆ తర్వాత అతడు తిరిగి జట్టులోకి రాలేదు.

Pravin Amre 2

రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ప్రవీణ్ ఆమ్రే కోచ్ అవతారం ఎత్తాడు. 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో భారతదేశం అండర్ -19 ప్రపంచ కప్ గెలిచినప్పుడు అతను కోచ్‌గా ఉన్నాడు. తర్వాత ముంబైకి కోచ్‌గా కూడా మారాడు. అతను ఐపీఎల్‌తో కూడా సంబంధం కలిగి ఉన్నాడు. పూణే వారియర్స్ సహాయ కోచ్‌గా పనిచేశాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ టీంతో భాగస్వమ్యం అయ్యాడు. జులై 2019లో, అతను యూఎస్ క్రికెట్ జట్టుతో కూడా సంబంధం కలిగి ఉన్నాడు. అలాగే ముంబై ఇండియన్స్ టాలెంట్ స్కౌట్ టీమ్‌లో కూడా ఒక భాగంగా ఉన్నాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌లోతో పనిచేస్తున్నాడు. చాలా మంది క్రికెటర్ల బ్యాటింగ్‌ని మెరుగుపరిచినందుకు ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. ఇందులో సురేష్ రైనా, అజింక్య రహానే, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్ వంటి పేర్లు ఉన్నాయి.

Also Read: IPL 2021: ఫ్యామిలీతో యూఏఈ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజాలు.. ప్రాక్టీస్ మ్యాచ్ ఎప్పుడంటే..?

IND vs ENG 2nd Test Day 3 Live: 150 చేరిన ఇంగ్లండ్ స్కోర్.. వికెట్ల కోసం భారత బౌలర్ల పోరాటం