IND vs ENG: రాహుల్‌పై షాంపైన్ కార్క్‌లను విసిరిన ప్రేక్షకులు.. ఘాటుగా స్పందించిన కోహ్లీ..!

లార్డ్స్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆట మూడో రోజు ఫీల్డింగ్ చేస్తున్న సెంచరీ వీరుడు కేఎల్ రాహుల్‌పై ప్రేక్షకులు తమ ఆగ్రహాన్ని చూపించారు.

IND vs ENG: రాహుల్‌పై షాంపైన్ కార్క్‌లను విసిరిన ప్రేక్షకులు.. ఘాటుగా స్పందించిన కోహ్లీ..!
Ind Vs Eng Kl Rahul
Follow us
Venkata Chari

|

Updated on: Aug 14, 2021 | 7:27 PM

India vs England 2nd Test Day 3: ఆటగాళ్లపై ప్రేక్షకులు జాత్యంహకార దాడులు చేస్తున్న వార్తలు వింటూనే ఉంటాం. ఎంత చప్పినా వారిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణగా నిలిచింది లార్డ్స్ టెస్ట్ మ్యాచ్. ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా టీంల మధ్య లార్డ్స్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆట మూడో రోజు ఫీల్డింగ్ చేస్తున్న సెంచరీ వీరుడు కేఎల్ రాహుల్‌పై ప్రేక్షకులు తమ ఆగ్రహాన్ని చూపించారు. అసలు విషయానికి వస్తే.. ఈ రోజు మ్యాచ్ మొదలైన మ్యాచ్ తొలి సెషన్‌లో రాహుల్ ఫీల్డింగ్ కోసం బౌండరీ దగ్గర ఉన్నాడు. అయితే కొంతమంది ప్రేక్షకులు షాంపైన్ బాటిళ్ల కార్క్‌లను రాహుల్‌పైకి విసిరారు. దీంతో ఒక్కసారిగా షాకైన రాహుల్.. కెప్టెన్ కోహ్లీకి వివరించాడు. దీంతో కోహ్లీ చాలా కోపంగా సమాధానమిచ్చాడు. ఆ కార్క్‌లను వారిపైకే విసరమంటూ గట్టిగా సైగ చేశాడు.

కామెంటేటర్లు కూడా ఇదే విషయాన్ని చర్చించారు. ఆటలో ఇలాంటి వాటిని అస్సలు ఉపేక్షించకూడదంటూ చెప్పుకొచ్చారు. దీనిపై పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే క్రికెట్‌లోనే కాదు ఇతర ఆటల్లో కూడా ఇలాంటివి చోటు చేసుకున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కోవిడ్ తరువాత పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టీమిండియా ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించి ఆన్ ఫీల్డ్ అంపైర్లకు నివేదించిందంట. అయితే వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో భారత అభిమానుల మాత్రం చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో ప్రేక్షకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

సెంచరీ బాయ్ కేఎల్ రాహుల్.. మరోవైపు ఈ సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. తొలి టెస్టులో అర్థ సెంచరీ(83) చేసిన ఆయన, రెండో టెస్టులో సెంచరీతో(129) ఆకట్టుకున్నాడు. అది కూడా లార్డ్స్‌ మైదానంలో సెంచరీ చేసి చరిత్ర నెలకొల్పాడు. రాహుల్ శతకంతో టీమిండియా 364 పరుగులు సాధించింది.

Also Read: Viral Video: నీరజ్ చోప్రాలో దాగి ఉన్న మరో టాలెంట్.. వీడియోలో దుమ్మురేపిన గోల్డెన్ బాయ్

Viral Video: ఇంటి చూరుపై పాముల సయ్యాట.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. జనాలు గద్దించినా

గంజాయి మత్తులో బస్టాండ్‌లో యువకుడి వీరంగం.. పరుగులు పెట్టిన జనం.. చివరకు.. షాకింగ్ వీడియో..

Viral Video: జింకను వేటాడేందుకు నక్కిన చిరుత.. షాకింగ్ సీన్.. వీడియో చూస్తే షాకవుతారు!