AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth: దళితులకంటే వెనుకబడి ఉన్నారన్న రేవంత్.. మైనార్టీ గర్జన సభలో ముస్లింలకు ఆఫర్లు

కారునో, పతంగినో నమ్ముకుంటే మోసపోయేది మీరే అంటూ మైనార్టీలను హెచ్చరించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. దళితుల కంటే కూడా

Revanth: దళితులకంటే వెనుకబడి ఉన్నారన్న రేవంత్.. మైనార్టీ గర్జన సభలో ముస్లింలకు ఆఫర్లు
Revanth Reddy
Venkata Narayana
|

Updated on: Aug 14, 2021 | 5:07 PM

Share

Revanth Reddy: కారునో, పతంగినో నమ్ముకుంటే మోసపోయేది మీరే అంటూ మైనార్టీలను హెచ్చరించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. దళితుల కంటే కూడా ముస్లింలు వెనుకబడ్డారని చెప్పుకొచ్చిన ఆయన.. కాంగ్రెస్ మైనార్టీ గర్జన సభ ఓట్ల కోసం పెట్టలేదన్నారు. ఇప్పట్లో ఎన్నికలు లేవన్న విషయం గుర్తించాలన్నారు. యువత ఆత్మహత్యలు చూడలేక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.. త్రిబుల్ తలాక్, ఎన్ఆర్సీ, సీఏఏ వంటి చట్టాలను వ్యతిరేకించింది కాంగ్రెస్ మాత్రమేనని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

“కాంగ్రెస్ దగ్గర 200 మంది ఎంపీలుంటే అలాంటి చట్టాలు తెచ్చే ధైర్యం చేసేవారా? కార్ కా స్త్రీరింగ్ అసద్ చేతిలో ఉందని చెప్పుకునే అసద్, త్రిబుల్ తలాక్ అనుకూలంగా రంజిత్ రెడ్డి ఎట్లా ఓటు వేస్తారు?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మైనార్టీలకు ఎవరివల్ల నష్టం జరుగుతుందో చెప్పాలనే మైనార్టీ గర్జన చేపట్టామని చెప్పిన రేవంత్, మైనార్టీలకు శత్రువైన కేసీఆర్‌ను కొట్టాలంటే మధ్యలో అసద్ అడ్డం ఉన్నాడు.. మోదీకి మద్ధతుగా నిలిచే కేసీఆర్ పార్టీని ఓడించాలి అని రేవంత్ రెడ్డి మైనార్టీలకు పిలుపునిచ్చారు.

“దళిత లెక్క.. మైనార్టీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనార్టీ బడ్జెట్, వక్ఫ్ బోర్డు జ్యూడిషరీ పవర్స్ కల్పిస్తామని హామీ ఇస్తున్న” అని రేవంత్ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన మైనార్టీ గర్జన సభలో వాగ్ధానం చేశారు.

Read also: Sandalwood: కరవు ప్రాంతంలో శ్రీగంధం గుబాళింపులు.!! గుట్టల కొలదీ గంధపు చెక్కలు

Follow Us
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా
బ్యాంకులు వరుసగా ఆరు రోజులు బంద్
బ్యాంకులు వరుసగా ఆరు రోజులు బంద్