Telangana: తెలంగాణ సర్కార్‌ సీరియస్.. ఇకపై వారిని ఉపేక్షించేది లేదంటూ..

ఎక్కడ కూల్చివేతలు జరిగినా వాటిని హైడ్రాకు అంటగట్టిస్తున్నారు. కొన్నిచోట్ల హైడ్రాకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ అక్కడ కూలుస్తున్న రెవెన్యూ అధికారులను వదిలేసి వాటికి హైడ్రాకు ముడి పెడుతున్నారు. ఫలితంగా ఆక్రమణల తొలగింపు, మూసి ప్రక్షాళన కార్యక్రమాలపై హైడ్రా పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు మరింత దిగజారి

Telangana: తెలంగాణ సర్కార్‌ సీరియస్.. ఇకపై వారిని ఉపేక్షించేది లేదంటూ..
Cm Revanth Serious
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 01, 2024 | 9:38 AM

ఇటీవల సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్న వార్తలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అభ్యంతరమైన భాషతో కొందరు నేతలను టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌ కాంగ్రెస్ నేతలను టార్గెట్‌గా చేసుకొని పెడుతున్న వీడియోలను వైరల్ చేస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని సీరియస్‌గా తీసుకుంది. అదే పనిగా కాంగ్రెస్ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్‌పై కఠినంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

వాస్తవ పరిస్థితులకు భిన్నంగా అసత్య ప్రచారాలు చేస్తూ పలు అంశాలకు కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసి కొన్ని యూట్యూబ్ ఛానల్ అదేపనిగా వీడియోలు తీస్తున్నారు. వీటితోపాటు తమకు అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పించడమే ధ్యేయంగా పెట్టుకొని, నోటికి వచ్చినట్లు కాంగ్రెస్ నాయకులను తిట్టిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో అలాంటి యూట్యూబ్ ఛానల్స్‌పై మరింత కఠినంగా వ్యవహరించేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అయ్యింది. అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్న వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

గత కొద్ది రోజులుగా హైడ్రా పై తీవ్రస్థాయిలో ఫేక్ వీడియోలు సర్క్యూలేట్‌ అవుతున్నాయి. ఎక్కడ కూల్చివేతలు జరిగినా వాటిని హైడ్రాకు అంటగట్టిస్తున్నారు. కొన్నిచోట్ల హైడ్రాకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ అక్కడ కూలుస్తున్న రెవెన్యూ అధికారులను వదిలేసి వాటికి హైడ్రాకు ముడి పెడుతున్నారు. ఫలితంగా ఆక్రమణల తొలగింపు, మూసి ప్రక్షాళన కార్యక్రమాలపై హైడ్రా పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు మరింత దిగజారి బాధితులు మాట్లాడిన దుర్భాషను ఎలాంటి ఎడిటింగ్ లేకుండా యూట్యూబ్ లలో అప్లోడ్ చేస్తూ వైరల్ చేసి ట్రెండింగ్ లో ఉండేలా చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కొన్ని సందర్భాల్లో ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మహిళా మంత్రులను టార్గెట్‌గా, వారిపై ఘోరమైన విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలలో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిపై అదే పనిగా తిట్టించడం, పైగా ఆ వీడియోను ఎలాంటి ఎడిటింగ్ చేయకుండా అలానే సోషల్ మీడియాలో పెడుతూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఘటనలు కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ సంబంధం లేని అంశాలకు రేవంత్ సర్కార్‌ను బదనాం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న ఇలాంటి పలు సంఘటనలు ఉదాహరిస్తూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేశారు.

యూట్యూబ్ ఛానల్ పేరుతో సమస్యలను చూపించడంలో తప్పులేదు.. కానీ, అదే పనిగా ఒక ప్రాంతానికి వెళ్లి సంబంధం లేని విషయాలను ప్రభుత్వానికి ఆపాధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బాధితులతో ప్రభుత్వాన్ని బూతులు తిట్టిస్తున్నారు. మహిళా మంత్రులు అని కూడా చూడకుండా కొంతమందితో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌ పై ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోలకు సంబంధించిన లింకులు జతపరుస్తూ ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయగా, పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు మరికొంతమంది కోసం గాలిస్తున్నారు.

ఇక తాజాగా మంత్రి కొండా సురేఖ పై ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన వ్యక్తులను ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ట్రోలింగ్ లను చూసి మంత్రి కొండా సురేఖ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. ఇలాంటి సోషల్ మీడియా ప్రజలకు ఏమాత్రం అవసరం లేదని, ప్రజలకు మంచి చేయడానికి వాటిని ఉపయోగించాలి తప్ప, అడ్డదారుల్లో ట్రోలింగ్ చేసి, లేని ఘటనను ప్రభుత్వానికి ఆపాదించడం మానుకోవాలని అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు సోషల్ మీడియా ట్రోలర్స్‌కి, యూట్యూబ్ ఛానల్స్ కు కఠిన హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో