Andhra Pradesh: అరసవల్లిలో అద్భుత దృశ్యం.. బంగారుమయంగా సూర్యనారాయణుడు.. రెండేళ్ల తరువాత..
శ్రీకాకుళం పట్ణణానికి 2 కి.మీ దూరంలోని అరసవల్లి గ్రామంలో ఉంది. ఇక్కడ కొలువైన సూర్యనారాయణ మూర్తి తన భక్తులకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే దైవంగా వెలుగొందుతున్నాడు. ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయంలోని స్వామి వారి మూలవిరాట్టును
ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం మన దేశంలోని అతికొద్ది సూర్య దేవాలయాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రం. శ్రీకాకుళం పట్ణణానికి 2 కి.మీ దూరంలోని అరసవల్లి గ్రామంలో ఉంది. ఇక్కడ కొలువైన సూర్యనారాయణ మూర్తి తన భక్తులకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే దైవంగా వెలుగొందుతున్నాడు. ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయంలోని స్వామి వారి మూలవిరాట్టును ఆ సూర్యకిరణాలు నేరుగా తాకాయి. లేలేత సూర్య కిరణాల స్పర్శతో స్వామి వారి మూలవిరాట్ దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనిమిచ్చింది.
ఉదయం 6:05 గంటలకు రెండు నిమిషాల పాటు భక్తులకు కనువిందు చేసింది ఆ అద్భుత దృశ్యం. రేపు బుధవారం రోజున కూడా మళ్లీ స్వామి వారి మూల విరాట్ ను తాకనున్నాయి సూర్యకిరణాలు. ప్రతి ఏటా దక్షిణాయంలో అక్టోబర్ 1, 2 తేదీల్లో ఉత్తరాయణంలో మార్చి 9,10 తేదీల్లో సూర్యకిరణాలు ఆలయంలోని మూల విరాట్ ను నేరుగా తాకుతాయి. వాతావరణం పారదర్శకంగా లేని కారణంగా గత రెండేళ్లుగా సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్టును స్పృశించకలేక పోయాయి.
ఈ వీడియో చూడండి..
గత రెండేళ్ల తరువాత అరసవల్లి క్షేత్రంలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కావడంతో భక్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. సూర్య భగవానుడి లేలేత కిరణాలు స్వామివారి మూల విరాట్టును తాకిన ఆ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు ఉదయాన్నే ఆలయానికి క్యూ కట్టారు. ఈ ప్రత్యక్ష నారాయణుడి దేవాలయానికి పురాణకాలం నుంచీ గొప్ప చరిత్ర ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..