Adilabad : విషజ్వరాలతో పల్లె ప్రజలు విల విల.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న డెంగ్యూ

ఇదిలా ఉంటే, పల్లెల్లో పరిశుభ్రతపై తక్షణ చర్యలు చేపట్టారు అధికారులు. వీధులు, మురికి కాల్వ నిర్వహణ, రోడ్లపై బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లటంపై దృష్టి సారించారు. ప్రజలకు కూడ పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో ఇంట్లో ఎక్కడా నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి.

Adilabad : విషజ్వరాలతో పల్లె ప్రజలు విల విల.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న డెంగ్యూ
Woman Dies Of Dengue
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 01, 2024 | 9:16 AM

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను డెంగ్యూ జ్వరం వణికిస్తోంది. డెంగ్యూ బారిన పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. డెంగ్యూ జ్వరంతో మహిళ మృతి చెందిన ఘటన సోమవారం లోకేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని భాగపూర్ గ్రామానికి చెందిన బైరి శ్రీలత ఐదు రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. మహిళ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

అటు, కుబీర్ మండలంలోని వర్ని గ్రామానికి చెందిన కొండిరాం అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా తీవ్రమైన జరంతో బాధ పడుతున్నాడు. పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ అని తేలింది. మెరుగైన చికిత్స కోసం బైంసాకు బయల్దేరాడు. ఈ క్రమంలోనే అలసి పోయి ఓ చోట చెట్టుకింద కూర్చున్నాడు. అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇదిలా ఉంటే, పల్లెల్లో పరిశుభ్రతపై తక్షణ చర్యలు చేపట్టారు అధికారులు. వీధులు, మురికి కాల్వ నిర్వహణ, రోడ్లపై బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లటంపై దృష్టి సారించారు. ప్రజలకు కూడ పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో ఇంట్లో ఎక్కడా నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఇది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను వ్యాప్తి చేసే దోమల నుండి మిమ్మల్ని కాపాడుతుందని చెప్పారు. అలాగే, ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. సులభంగా జీర్ణమయ్యే ఆరోగ్యకరమైన, తేలికపాటి భోజనం తీసుకోవాలని సూచించారు. వీలైనంత వరకూ కాచి, చల్లార్చిన నీటినే తరచూ తాగుతూ ఉండాలని చెప్పారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాలని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..