ఎలుగుబంటి ఎదురుదాడి.. పెద్దపులి పరుగో పరుగు..ఆదిలాబాద్‌ అడవుల్లో సీన్‌ రీవర్స్..

ఆదిలాబాద్ జిల్లాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు మహారాష్ట్ర తాడోబా పులుల అభయారణ్యంగా దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. మహారాష్ట్రలోని చంద్రపూర్‌- యావత్‌మాల్‌ జిల్లా సరిహద్దులో గల తాడోబా పులుల అభయారణ్యంలో చెట్ల పొదల మాటున ఓ ఎలుగుబంటు తన పిల్లలతో కలిసి ఆవాసం ఏర్పరచుకుంది. ఇది గమనించి అటుగా వచ్చిన పెద్దపులి పిల్ల ఎలుగుబంటిపై దాడికి ప్రయత్నించగా,

ఎలుగుబంటి ఎదురుదాడి.. పెద్దపులి పరుగో పరుగు..ఆదిలాబాద్‌ అడవుల్లో సీన్‌ రీవర్స్..
mother bear fights with a tiger
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 01, 2024 | 8:53 AM

ప్రపంచంలో ఎక్కడా అమ్మ ప్రేమకు సాటిలేదు. ప్రతి కష్టంలోనూ తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి తన పిల్లల్ని కాపాడుకునేందుకు పరిగెత్తుతుంది. ఎండలో నీడలా, వానలో గొడుగులా, చలికాలంలో వెచ్చని చలిమంట అవుతుంది..అన్నీ కాలలు, ఎళ్లవేళలు తల్లి తన బిడ్డలకు రక్షణగా నిలుస్తుంది. బిడ్డలకు అండగా నిలిచే తల్లి అవసరమైతే.. ఆ యముడితో కూడా పోరాడుతుంది. ఎవరైనా దాడి చేయాలని చూస్తే.. తాట తీస్తుంది.. వారి దుమ్ము రేపుతుంది. మనిషికైనా జంతువు అయినా తల్లి ఎప్పుడూ తల్లే. దీనికి చక్కటి ఉదాహరణ ఈరోజు వైరల్ అవుతున్న ఈ వీడియో. ఆదిలాబాద్‌ జిల్లాలోని అభయారణ్యంలో సీసీ కెమెరాకు చిక్కింది ఈ షాకింగ్‌ సీన్‌.. పూర్తి వివరాల్లోకి వెళితే..

అభయారణ్యంలో తిరుగులేని రారాజుగా హడలెత్తించే పెద్దపులి ఎలుగుబంటి ఎదురుదాడితో తోకముడిచి పరుగు లంకించిన వింత ఘటన తడోబా అడవుల్లో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు మహారాష్ట్ర తాడోబా పులుల అభయారణ్యంగా దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. మహారాష్ట్రలోని చంద్రపూర్‌- యావత్‌మాల్‌ జిల్లా సరిహద్దులో గల తాడోబా పులుల అభయారణ్యంలో చెట్ల పొదల మాటున ఓ ఎలుగుబంటు తన పిల్లలతో కలిసి ఆవాసం ఏర్పరచుకుంది. ఇది గమనించి అటుగా వచ్చిన పెద్దపులి పిల్ల ఎలుగుబంటిపై దాడికి ప్రయత్నించగా, ఇది సమహించని తల్లి ఎలుగుబంటు ఆత్మరక్షణ కోసం ఉగ్రరూపం దాచ్చి పెద్దపులిపై ఎదురు దాడికి దిగింది.

ఎలుగుబంటు దాటికి తట్టుకోలేని పెద్దపులి తోకముడిచి పరుగుపెట్టగా, ఎలుగుబంటి అంతటితో ఆగకుండా పెద్దపులిని వెంటాడిన వీడియో అక్కడి అటవీశాఖ సీసీ ఫుటేజీకి చిక్కింది. ఎలుగుబంటి పెద్దపులిని వేటాడిన ఈ వీడియో ఫుటేజీని అటవీశాఖ అధికారులు ఆదివారం విడుదల చేశారు. ఎలుగుబంటు ముందు పెద్దపులి పిల్లిగా మారి పరుగులు పెట్టిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై పాజిటివ్‌ స్పందించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఎలుగుబంటి తన బిడ్డ కోసం తన ధైర్యసాహసాలను చూపించింది. పులి దాడి నుంచి తన పిల్లను రక్షించేందుకు ఓ ఎలుగుబంటి తన ప్రాణాలను పణంగా పెట్టింది అంటూ ప్రతి ఒక్కరూ ఎలుగుబంటి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. అమ్మ ప్రేమను మరోమారు గుర్తు చేసుకుంటూ తమ అభిప్రాయాలను తెలియజేస్తు్న్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..