Telangana: సీఎం రేవంత్ జిల్లాల టూర్ ఖరారు.. అక్కడి నుంచే తొలిపర్యటన..

సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల టూర్ షురూ కానుంది. పాలమూరు జిల్లా నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. గ్రామానాభివృద్ధే థ్యేయంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తెలంగాణలో అధికారం చేపట్టాక సీఎం రేవంత్ రెడ్డి తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. మొన్నటి వరకూ పార్లమెంట్ ఎన్నికల హడావిడిలో గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు పరిపాలన, అభివృద్ది పనులపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా తానే స్వయంగా తెలంగాణలోని జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు.

Telangana: సీఎం రేవంత్ జిల్లాల టూర్ ఖరారు.. అక్కడి నుంచే తొలిపర్యటన..
CM Revanth Reddy
Follow us

|

Updated on: Jul 08, 2024 | 6:51 AM

సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల టూర్ షురూ కానుంది. పాలమూరు జిల్లా నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. గ్రామానాభివృద్ధే థ్యేయంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తెలంగాణలో అధికారం చేపట్టాక సీఎం రేవంత్ రెడ్డి తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. మొన్నటి వరకూ పార్లమెంట్ ఎన్నికల హడావిడిలో గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు పరిపాలన, అభివృద్ది పనులపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా తానే స్వయంగా తెలంగాణలోని జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. మొన్న వరంగల్‎లో పర్యటించిన సీఎం రేవంత్ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరో హైదరాబాద్‎గా వరంగల్ ను తీర్చిదిద్దుతానంటున్నారు. అదే క్రమంలో ఇప్పుడు తన సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లాల టూర్‌ ప్రారంభిస్తున్నారు. ఈనెల 9న మహబూబ్‌నగర్‌ కి వెళ్లనున్నారు సీఎం రేవంత్. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్ట్‌లు, విద్యా, వైద్యంపై రివ్యూ చేస్తారు. సీఎం రివ్యూలో ఉమ్మడి జిల్లాలోని ఐదుగురు కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొననున్నారు.

సీఎం పర్యటన నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లో పర్యటించారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. తానే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాట్లు చెప్పారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న 1000 పడకల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి హాస్సిటల్ పనులను, పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సర్కారు దవాఖానాను ప్రతి పేదవాడు ఓన్ చేసుకునేలా మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు మంత్రి. కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రిలో సుమారు 600కు పైగా ఉద్యోగాల భర్తీ చేయాల్సి ఉందన్నారు. దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ స్థాయి నుంచి వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు మంత్రి. సీఎం పర్యటనలో ఉమ్మడి జిల్లాలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చర్చిస్తామన్నారు మంత్రి దామోదర.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం