Hyderabad: సాయి ధరమ్‌ తేజ్‌ ట్వీట్‌పై స్పందించిన తెలంగాణ డీజీపీ.. ఆ యూట్యూబర్‌పై కేసు నమోదు

ప్రణీత్ హనుమంతు అనే ఓ తెలుగు యూట్యూబర్‌ ఆన్‌లైన్‌లో ఓ డిబేట్‌ను చేపట్టాడు. ఇందులో కొందరు వ్యక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రీ, కూతుళ్ల మధ్య సాగే ఓ వీడియోపై నోటికొచ్చినట్లు వాగారు. వారి అసభ్య కామెంట్స్‌ చేసి, అదేదో గొప్ప పని చేస్తున్నట్లు విరగబడి మరీ నవ్వారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది...

Hyderabad: సాయి ధరమ్‌ తేజ్‌ ట్వీట్‌పై స్పందించిన తెలంగాణ డీజీపీ.. ఆ యూట్యూబర్‌పై కేసు నమోదు
Youtuber Hanmanthu
Follow us

|

Updated on: Jul 08, 2024 | 7:35 AM

సోషల్‌ మీడియా స్వేచ్ఛను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. నోరు ఉంది కదా అని, ఇంటర్నెట్ అందుబాటులో ఉంది కదా అని నోటికొచ్చినట్లు వాగుతున్నారు. కనీసం మానవత్వాన్ని, చదువుకున్నామన్న విషయాన్ని కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ దారుణ ఘటన సోషల్‌ మీడియా వేదికగా జరిగిన విషయం తెలిసిందే.

ప్రణీత్ హనుమంతు అనే ఓ తెలుగు యూట్యూబర్‌ ఆన్‌లైన్‌లో ఓ డిబేట్‌ను చేపట్టాడు. ఇందులో కొందరు వ్యక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రీ, కూతుళ్ల మధ్య సాగే ఓ వీడియోపై నోటికొచ్చినట్లు వాగారు. అసభ్య కామెంట్స్‌ చేసి, అదేదో గొప్ప పని చేస్తున్నట్లు విరగబడి మరీ నవ్వారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన హీరో సాయి ధరమ్ తేజ్‌ అగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో ఉండే మృగాల నుంచి పేరెంట్స్‌ తమ పిల్లల్ని కాపాడుకోవాలంటూ విజ్ఙప్తి చేశారు తేజ్‌. సదరు వీడియోను పోస్ట్ చేస్తూ సుదీర్ఘంగా ఓ పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్‌ అయ్యింది. దీనిపై ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీం మల్లు భట్టి విక్రమార్క సైతం స్పందించారు. . ఈ క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు సాయి  తేజ్‌ కు ధన్యవాదాలు తెలిపారు. పిల్లల భద్రత నిజానికి అత్యంత ప్రాధాన్యత అంశం అన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫమ్‌లలో పిల్లల ఫొటోలు, వీడియోలు దుర్వినియోగాన్ని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

సాయితేజ్ పోస్ట్..

సీఎం రేవంత్ ట్వీట్…

అయితే ఈ సంఘటనపై తెలంగాణ పోలీసులు రియాక్ట్ అయ్యారు. అసభ్యకరమైన రీతిలో సంభాషిన యూట్యూబర్‌పై వెంటనే కేసు నమోదు చేస్తున్నట్లు తెలంగాణ డీజీపీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్ చేశారు. సాయి ధరమ్‌ తేజ్‌ పోస్ట్‌ను రీ ట్వీట్‌ చేస్తూ తెలంగాణ డీజీపీ అధికారిక పేజీ నుంచి ఈ పోస్ట్‌ చేశారు. అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసినట్లు తెలిపారు. చిన్నారులను కాపాడేందుకు తాము కృత నిశ్చయంతో ఉన్నామని స్పష్టం చేశారు. మరి పోలీసుల చర్యతో అయినా ఇలాంటి వికృతాలకు ఫుల్‌స్టాప్‌ పడుతుందో చూడాలి.

తెలంగాణ డీజీపీ స్పందన..

ఇదిలా ఉంటే ఇదే విషయమై మరో హీరో మంచి మనోజ్‌ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. వినోదం ముసుగులో ఇలాంటి దారుణాలు జారడం చాలా ప్రమాదకరమన్నారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకునేందుకు ఇన్ స్టా గ్రామ్ ద్వారా హనుమంతు అనే వ్యక్తిని సంప్రదించానని, కానీ అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. అయితే ఈరోజు అతనే పసిపిల్లలపై నీచమైన కామెంట్స్ చేయడం దారుణమన్నారు. దయచేసి ఇలాంటి వారిని అసలు ఉపేక్షించవద్దని తెలుగు రాష్ట్రాల పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాన్న మనోజ్‌.. పి హనుమంతు.. అమ్మ తోడు.. నిన్ను వదిలిపెట్టను అంటూ ఘాటుగా స్పందించారు.

మంచు మనోజ్ పోస్ట్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే
కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే
ఆ రుజువు ఐసీసీకి ఇవ్వాల్సిందే: బీసీసీఐని ఇరకాటంలో పడేసిన పీసీబీ
ఆ రుజువు ఐసీసీకి ఇవ్వాల్సిందే: బీసీసీఐని ఇరకాటంలో పడేసిన పీసీబీ
రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగిన బిగ్‏బాస్ బ్యూటీ..
రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగిన బిగ్‏బాస్ బ్యూటీ..
మార్కెట్లోకి స్టన్నింగ్ స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది.. తక్కువ ధరల
మార్కెట్లోకి స్టన్నింగ్ స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది.. తక్కువ ధరల
ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తున్న అమెరికన్లు.. అమాంతం పెరిగిన క్రేజ్
ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తున్న అమెరికన్లు.. అమాంతం పెరిగిన క్రేజ్
విజేతలు ఒలింపిక్ పతకాన్ని ఎందుకు కొరుకుతారు?
విజేతలు ఒలింపిక్ పతకాన్ని ఎందుకు కొరుకుతారు?
కేజ్రీవాల్ బరువుపై వివాదం.. జైలు అధికారులు ఏం చెబుతున్నారంటే?
కేజ్రీవాల్ బరువుపై వివాదం.. జైలు అధికారులు ఏం చెబుతున్నారంటే?
లంక పర్యటనకు ఇద్దరు కెప్టెన్లు.. రెండు ఫార్మట్లకు వేర్వేరుగా
లంక పర్యటనకు ఇద్దరు కెప్టెన్లు.. రెండు ఫార్మట్లకు వేర్వేరుగా
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొంటున్నారా.? ఈ వాస్తు నియమాలు పాటించండి
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొంటున్నారా.? ఈ వాస్తు నియమాలు పాటించండి