CM Revanth: జాబ్ నోటిఫికేషన్‌పై మాటల తూటాలు.. సీఎం రేవంత్ వెర్సస్ బీఆర్ఎస్ నేతలు..

నిరుద్యోగులుకు ఉద్యోగాలిచ్చిన ఘనత ఎవరిది..? తెలంగాణలో ఇప్పుడు ఇదే అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పుట్టిస్తోంది. అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చామని చెబుతోంది ప్రభుత్వం.

CM Revanth: జాబ్ నోటిఫికేషన్‌పై మాటల తూటాలు.. సీఎం రేవంత్ వెర్సస్ బీఆర్ఎస్ నేతలు..
CM Revanth Reddy
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 10, 2024 | 8:57 PM

తెలంగాణలో ఓ వైపు హైడ్రా, మూసీ సుందరీకరణపై..ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా ఇప్పుడు కొత్తగా వాటికి జాబ్స్‌వార్‌ తోడయింది. డీఎస్సీ-2024 విజేతలకు తాజాగా నియాకమ పత్రాలు అందించిన సీఎం రేవంత్‌రెడ్డి..గత కేసీఆర్‌ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తమ కలలు నెరవేరుతాయని నిరుద్యోగులు భావిస్తే..కేసీఆర్‌ మాత్రం వారిని మోసం చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చిందని చెప్పారు.

నిరుద్యోగులను కేసీఆర్‌ మోసం చేశారన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు..బీఆర్‌ఎస్‌ నేతలు. కేసీఆర్‌ హయాంలో రికార్డు స్థాయిలో లక్షా 62 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. అయితే ఆ విషయాన్ని తమ పార్టీ ప్రచారం చేసుకోలేకపోయిందన్నారు మాజీ ఎంపీ వినోద్. మార్కెటింగ్‌లో రేవంత్‌ను మించినవారు లేరని మండిపడ్డారు. మరోవైపు విద్యార్థులు, గురువుల ముందు కేసీఆర్‌ను విమర్శించడమే మీ విధానమా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎక్స్‌లో ప్రశ్నించారు..మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ ప్రభుత్వం ఇచ్చామని చెప్తున్న టీచర్ పోస్టులు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసినవి కాదా అన్నారు. ఎన్నికల ముందు మీరు చెప్పిన 25 వేల టీచర్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదో ఆ గురువుల ముందు చెప్తే బాగుండేదన్నారు. ఎన్నికలప్పుడు 6వేల పాఠశాలలు మూత పడ్డాయని అబద్దం చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఆ పాఠశాలల లిస్ట్ విడుదల చేస్తే బాగుండేదన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన “మన ఊరు మన బడి” కార్యక్రమం ఎందుకు ఆపేసారో చెప్పాలన్నారు సబిత.

డీఎస్సీపైనా బీఆర్‌ఎస్‌ నేతలు కుట్రలు పన్నారని అయినా 65 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేశామంటోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. మరోవైపు బీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగ‌ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం.. డిసెంబర్ 31లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని లేకుంటే ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరిస్తోంది కారుపార్టీ. మరి ఈ విమర్శలకు ప్రభుత్వం ఏ విధంగా కౌంటర్‌ ఇస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి సీన్ ఇది.. అసలేం జరిగిందంటే

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే