Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి సీన్ ఇది.. అసలేం జరిగిందంటే

వారిద్దరూ లవర్స్. ఇంట్లో తెలియకుండా ఒకరినొకరు వీలు కుదిరినప్పుడల్లా బయట కలుసుకుంటున్నారు. ఇటీవల ఈ ఇద్దరూ కూడా వీకెండ్ అని చెప్పి.. వేరే ఊరుకు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ఆ క్రమంలోనే ఓ హోటల్‌లో దిగారు.

Viral: గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి సీన్ ఇది.. అసలేం జరిగిందంటే
Trending
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 02, 2024 | 5:13 PM

వారిద్దరూ లవర్స్. ఇంట్లో తెలియకుండా ఒకరినొకరు వీలు కుదిరినప్పుడల్లా బయట కలుసుకుంటున్నారు. ఇటీవల ఈ ఇద్దరూ కూడా వీకెండ్ అని చెప్పి.. వేరే ఊరుకు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ఆ క్రమంలోనే ఓ హోటల్‌లో దిగారు. ఆపై ఇద్దరి మధ్య రొమాంటిక్ మూమెంట్స్ చోటు చేసుకున్నాయి. సీన్ కట్ చేస్తే.. తెల్లారేసరికి జరగరానిది జరిగింది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే.?

మెడికల్ ఎమర్జెన్సీ తక్షణం అందకపోతే.. ప్రాణానికే ప్రమాదమవుతుందని మరోసారి తేలింది. 23 ఏళ్ల నర్సింగ్ గ్రాడ్యుయేట్ లైంగిక సంపర్కం తర్వాత తీవ్ర రక్తస్రావం కారణంగా మృతి చెందింది. ఈ ఘటనకు కారణమైన 26 ఏళ్ల వ్యక్తిని గుజరాత్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం, లైంగిక సంపర్కం జరిగిన సమయంలో మహిళ ప్రైవేటు పార్ట్‌కు గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం అయిందని నిర్ధారణ అయింది.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ నెల చివరి వారంలో 26 ఏళ్ల వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌తో నవ్‌సారిలోని ఓ హోటల్‌లో దిగాడు. ఆ సమయంలో వీరిద్దరూ శారీరికంగా కలుసుకున్నారు. అప్పుడే ఆ యువతి ప్రైవేట్ పార్ట్‌కు గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం అయింది. ఆస్పత్రికి తరలించడం లేదా అంబులెన్స్‌కి కాల్ చేయడం లాంటివి ప్రయత్నించకుండా.. సదరు వ్యక్తి ఓ గుడ్డముక్క ద్వారా రక్తస్రావాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ అదేం సాధ్యకాకపోవడం.. ఆ యువతి కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి చేరి.. మరణించడం జరిగింది.

నిందితుడు వైద్య సాయం కోసం ప్రయత్నించలేదని.. మొబైల్‌లో సుమారు 90 నిమిషాల పాటు రక్తస్రావం కంట్రోల్ చేయడానికి చేయాల్సిన నివారణలపై ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశాడని పోలీసులు తెలిపారు. ఇక సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత, సదరు వ్యక్తి తన స్నేహితుడిని హోటల్‌కి పిలిచి, ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. అయితే ఆస్పత్రికి చేరుకోగానే.. వైద్యులు ఆమెను పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. లైంగిక చర్య సమయంలో ప్రైవేటు పార్ట్‌కు బలమైన గాయం కావడంతో అధిక రక్తస్రావం జరిగి మహిళ చనిపోయిందని మృతురాలి పోస్టుమార్టం నివేదికలో తేలిందని నవ్‌సారి పోలీసులు స్పష్టం చేశారు. కాగా, నిందితుడ్ని అరెస్ట్ చేసి.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇది చదవండి: నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని చూడగా గుండె గుభేల్

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..