Viral Video: నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని చూడగా గుండె గుభేల్

మానవ సాంకేతికత అంతుచిక్కని ఎన్నో వింత జీవులు సముద్రలోతుల్లో ఉన్నాయి. అవి విశాల ప్రపంచానికి అరుదుగా చిక్కుతాయి. ఇలాంటి ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతుంటాయి.

Viral Video: నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని చూడగా గుండె గుభేల్
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 30, 2024 | 12:07 PM

మానవ సాంకేతికత అంతుచిక్కని ఎన్నో వింత జీవులు సముద్రలోతుల్లో ఉన్నాయి. అవి విశాల ప్రపంచానికి అరుదుగా చిక్కుతాయి. ఇలాంటి ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ ఘటన ఇటీవల కెనడాలో చోటు చేసుకుంది. జాలర్ల వలకు ఓ వింత సముద్రపు జీవి చిక్కింది. దాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

వివరాల్లోకి వెళ్తే.. కెనడాలోని కొందరు జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్తే.. వారి గాలానికి ఓ పెద్ద విచిత్ర జంతువు చిక్కింది. మొసలి లాంటి ఆకారంతో కూడిన ఓ పెద్ద చేప ఈ మత్స్యకారులకు దొరికింది. నీటితో తేలియాడుతున్న ఆ భయంకర ఆకారాన్ని చూసి ఆ జాలర్లు సైతం వణికిపోయారు. ఇంతకీ ఆ చేప ఏంటని అనుకుంటున్నారా.? ఆ చేప పేరు వైట్ స్టర్జన్. 120 అడుగుల వరకు పెరిగే ఈ జీవి 150 సంవత్సరాలు వరకు బతుకుతుంది. దీని బరువు దాదాపుగా ఒక టన్ను ఉంటుంది.

ఇవి కూడా చదవండి

దాదాపు 200 మిలియన్ సంవత్సరాలకు పైగా ఉనికి ఉన్న ఈ పురాతన జీవులు.. ఉత్తర అర్ధగోళంలో నదులు, సరస్సులు, తీరప్రాంత జలాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

ఇది చదవండి: ఓర్నీ ప్రేమ సల్లగుండా.! భార్య బికినీ కోసం ఏకంగా ఇన్ని వందల కోట్లా.? అదేంటంటే

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..