Watch: హరికేన్ విధ్వంసం.. పదుల సంఖ్యలో మృతులు.. నిరాశ్రయులుగా రోడ్డునపడ్డ వందలాది మంది

ఇప్పటివరకు 56 మంది మృతి చెందగా...వందల మంది నిరాశ్రయులయ్యారు. మిలియన్ల మందిని విద్యుత్తు లేకుండా అంధకారంలోకి నెట్టింది. తుపాను కారణంగా ఫ్లోరిడాతోపాటు పరిసర రాష్ట్రాలైన జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా, అలబామా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు.

Watch: హరికేన్ విధ్వంసం.. పదుల సంఖ్యలో మృతులు.. నిరాశ్రయులుగా రోడ్డునపడ్డ వందలాది మంది
Hurricane Helene
Follow us

|

Updated on: Sep 30, 2024 | 12:03 PM

Hurricane Helene : గంటలకు 225 కిలోమీటర్ల వేగంతో వచ్చిన తుఫాను ఫ్లోరిడా, ఆగ్నేయ అమెరికాలో భారీ విధ్వంసం సృష్టించింది. ఈ తుఫానుకు హెలెన్ అని పేరు పెట్టారు. హరికేన్ తుఫాన్ అమెరికాలో మూడ్రోజులుగా బీభత్సం సృష్టిస్తోంది. హరికేన్ హెలెనా విధ్వంసంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. పెనుగాలులకు ఫ్లోరిడా రాష్ట్రం చిగురుటాకులా వణికింది. ఎటు చూసినా విరిగిపడిన చెట్లు, కుప్పకూలిన ఇళ్లు, వరద నీటితో పరిస్థితి భయానకంగా మారింది. నాలుగు రాష్ట్రాల్లో హెలెనా సృష్టించిన విధ్వంసానికి ఇప్పటివరకు 56మంది మరణించారని సమాచారం.

పెనుగాలులకు ఫ్లోరిడా వణికిపోతే.. అట్లాంటాను వర్షం ముంచెత్తింది. దీంతో జనం భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. తుఫాను ధాటికి ఇక్కడ చాలా ఇళ్లు పేకముక్కల్లా కూలిపోగా, పొడవాటి ఓక్ చెట్లు గడ్డివాములా విరిగిపోతున్నాయి. తుపాను కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత రెస్క్యూ టీమ్ ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టింది.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

తుపాను కారణంగా, అమెరికాలోని జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా మరియు అలబామా హరికేన్ చాలా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీని కారణంగా ఇప్పటివరకు 56 మంది మృతి చెందగా…వందల మంది నిరాశ్రయులయ్యారు. మిలియన్ల మందిని విద్యుత్తు లేకుండా అంధకారంలోకి నెట్టింది. తుపాను కారణంగా ఫ్లోరిడాతోపాటు పరిసర రాష్ట్రాలైన జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా, అలబామా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..