ఫ్రాంక్ వీడియో కోసం రోడ్డు మధ్యలో విస్కీ బాటిల్ పెట్టాడు.. కట్‌చేస్తే.. సీన్ సితారయిందిగా

రోడ్డు మధ్యలో ఒక మద్యం సీసా కనిపించింది. ఆ సీసాను గమనించిన ప్రజలు కొందరు దాన్ని పట్టించుకోకుండా పోతున్నారు. మరికొందరు దాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టమనే చెప్పాలి. ఇక్కడ రోడ్డు మధ్యలో బీరు సీసాలు పెట్టి ఫన్నీగా చేశారు కొందరు యువకులు.

ఫ్రాంక్ వీడియో కోసం రోడ్డు మధ్యలో విస్కీ బాటిల్ పెట్టాడు.. కట్‌చేస్తే.. సీన్ సితారయిందిగా
Prank
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 30, 2024 | 11:37 AM

రద్దీగా ఉండే రోడ్డుపై బీరు బాటిల్ కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు..! సరిగ్గా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. నడిరోడ్డుపై కనిపించిన నిండు మద్యం బాటిల్ ఒకటి స్థానికులతో పాటు నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. రోడ్డుపై మద్యం బాటిల్‌ కనిపించగానే.. అటుగా వచ్చిన వాహనదారులు, స్థానికులు ఏం చేశారో చూపించే వీడియో ఇది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వీడియో దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించినదిగా తెలిసింది. ఇది చూసిన తర్వాత మీరు కూడా నవ్వకుండా ఉండలేరు..ఎందుకంటే, ఈ వీడియోలో కనిపిస్తున్న రోడ్డు హేవీ ట్రాఫిక్‌తో ఉంది.. ఎక్కువగా కార్లు, బైకులు అటు ఇటూ పరిగెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ రోడ్డు మధ్యలో ఒక మద్యం సీసా కనిపించింది. ఆ సీసాను గమనించిన ప్రజలు కొందరు దాన్ని పట్టించుకోకుండా పోతున్నారు. మరికొందరు దాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టమనే చెప్పాలి. ఇక్కడ రోడ్డు మధ్యలో బీరు సీసాలు పెట్టి ఫన్నీగా చేశారు కొందరు యువకులు.

ఇవి కూడా చదవండి

కాసేపటి తరువాత అటుగా వచ్చిన ఓ కారు డ్రైవర్ మద్యం బాటిల్‌కు దగ్గరగా వచ్చాడు.. కార్‌ డోర్ తెరిచి బీరు బాటిల్ తీసుకున్నాడు. ఆ వ్యక్తి బీరు బాటిల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ, ఇక్కడ వాస్తవం ఏంటంటే.. ఇదంతా ప్రాంక్‌ అని ఆ తర్వాత తెలిసింది. దూరంగా నిలబడి ఉన్న కొందరు యువకులు ఇదంతా వీడియోను రికార్డ్ చేస్తున్నారు.  అది తరువాత సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇంటర్‌నెట్‌లో వీడియో చూసిన ప్రజలు దీనిపై పెద్ద ఎత్తున స్పందించారు.  ఫుల్ బాటిల్ పాయే అంటూ ఒకరు రాయగా, ఈ  రకమైన ప్రాంక్‌ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఒకరు రాశారు. ఇలాంటి పనులు చేసేవారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ఆ బాటిల్‌ పగిలితే పరిస్థితి ఏంటని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులు వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని మరొకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..