ట్రాఫిక్‌లో చిక్కుకున్న చుక్ చుక్ రైలు.. క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ..! ఇది సంగతన్నమాట..

ఇలాంటి గందరగోళ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయని, ప్రజలు ఆలోచించకుండా ఫార్వార్డ్ చేస్తున్నారని చెప్పారు. దీంతో రైల్వేల పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతో సమాజంలో అరాచక పరిస్థితులు నెలకొంటున్నాయని, మరోమారు ఇలాంటి చర్యలు తగవని రైల్వే అధికారులు కోరుతున్నారు.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న చుక్ చుక్ రైలు.. క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ..! ఇది సంగతన్నమాట..
bengaluru traffic jam
Follow us

|

Updated on: Sep 28, 2024 | 11:18 AM

గత కొంతకాలంగా రైల్వేకు సంబంధించి అనేక రకాలైన వార్తలు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా, రైల్వే గేట్‌ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ దగ్గరలోనే రైలు ఆగి ఉంది.. ఈ వీడియో బెంగుళూరుకు చెందినదని ఇక్కడ ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉండటంతో రైలు కూడా జామ్‌లో ఇరుక్కుపోయిందని ప్రచారం జరుగుతోంది. వీడియో వేగంగా వైరల్ అయ్యింది. రైలు ప్రయాణికులు భద్రత, ప్రయాణ సమయంపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడు ఈ విషయంలో సౌత్ వెస్ట్ రైల్వే (SWR) స్పందించింది. ఎస్‌డబ్ల్యూఆర్‌ సీనియర్‌ అధికారి ఒకరు దీనిపై మాట్లాడుతూ.. ‘రైలు ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకోలేదని, సాంకేతిక సమస్యతో మున్నెకోళ్ల గేటు దగ్గర నిలిపివేశామన్నారు. లోకో పైలట్ శబ్దం విని, రేక్‌లో ఏదో లోపం ఉందని అనుమానించాడు. టెక్నికల్ టీమ్ రాక కోసం దానిని నిలిపివేసి, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా గేట్లు తెరిచారు. వీడియోలో కనిపిస్తున్న రైలు యశ్వంత్‌పూర్-కొచువేలి గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్.

ఈ వీడియోను సుధీర్ చక్రవర్తి అనే వ్యక్తి మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అందులో రోడ్డుపై వాహనాల కారణంగా రైలు ఆగిపోయినట్లు కనిపిస్తోంది. అతను వీడియో క్యాప్షన్‌లో ఇలా రాశాడు- ‘ఇది బెంగళూరు ట్రాఫిక్‌ పరిస్థితి..నేను, మీరు మాత్రమే కాదు.. బెంగళూరు ట్రాఫిక్ నుండి రైళ్లు కూడా తప్పించుకోలేవని రాశారు.

ఇవి కూడా చదవండి

మున్నెకొల్లాల్ ప్రాంతంలో ట్రాఫిక్ భయంకరంగా ఉంది. మేము ప్రతిరోజూ ట్రాఫిక్‌ సమస్యను ఎదుర్కొంటున్నామని చెప్పాడు. ఈ ప్రాంతంలో సరైన ట్రాఫిక్ నిర్వహణ లేదని, దీనిపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఇలాంటి గందరగోళ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయని, ప్రజలు ఆలోచించకుండా ఫార్వార్డ్ చేస్తున్నారని చెప్పారు. దీంతో రైల్వేల పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతో సమాజంలో అరాచక పరిస్థితులు నెలకొంటున్నాయని, మరోమారు ఇలాంటి చర్యలు తగవని రైల్వే అధికారులు కోరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

దేవర కోసం యాట మొక్కు.. ఎవ్వరూ తగ్గట్లే !!
దేవర కోసం యాట మొక్కు.. ఎవ్వరూ తగ్గట్లే !!
దేవర హిట్‌.. యంగ్‌ టైగర్ రియాక్షన్
దేవర హిట్‌.. యంగ్‌ టైగర్ రియాక్షన్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..