AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: డ్రైవర్‌ సహా మంటల్లో తగలబడిపోతున్న కారు.. స్థానికులు ఏం చేశారో చూస్తే..

నడిరోడ్డుపై ఒక కారు దట్టమైన మంటల్లో కాలిపోతోంది. ఘటనాస్థలిని పరిశీలిస్తే కారు సైడ్ రైలింగ్‌ను ఢీకొట్టి మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. దట్టమైన మంటలతో ఆ కారు ఏ క్షణంలోనైనా పేలిపోయే ప్రమాదం ఉంది..మరోవైపు కారులో ఉన్నవారు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు.

Watch: డ్రైవర్‌ సహా మంటల్లో తగలబడిపోతున్న కారు.. స్థానికులు ఏం చేశారో చూస్తే..
man stuck inside burning car
Jyothi Gadda
|

Updated on: Sep 28, 2024 | 7:34 AM

Share

నేటి బిజీ లైఫ్‌ కారణంగా తోటి వారికి సాహాయం చేసే సమయమే లేకుండా పోయింది. అంతేకాదు.. నేటి ప్రపంచం చాలా స్వార్థపూరితంగా మారింది. కళ్లేదురుగా మనిషి ప్రాణం పోతున్నా కూడా ఎవరూ పట్టించుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, ఇతరుల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి మానవత్వానికి ఆదర్శంగా నిలిచే వ్యక్తులు కూడా ఉన్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇందులో ఓ కారు ప్రమాదానికి గురై రోడ్డు పక్కన దారుణంగా తగలబడిపోతోంది.. అది చూసిన స్థానికులు ఏం చేశారో ఇక్కడ చూడొచ్చు..

నడిరోడ్డుపై ఒక కారు దట్టమైన మంటల్లో కాలిపోతోంది. ఘటనాస్థలిని పరిశీలిస్తే కారు సైడ్ రైలింగ్‌ను ఢీకొట్టి మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. దట్టమైన మంటలతో ఆ కారు ఏ క్షణంలోనైనా పేలిపోయే ప్రమాదం ఉంది..మరోవైపు కారులో ఉన్నవారు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో కారు తగలబడిపోతున్నా వారు బయటకు రాలేకపోయారు.. కారు మంటల్లో కాలిపోవటం గమనించిన అక్కడి స్థానికులు, వాహనదారులు హుటాహుటినా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. క్షణాల్లో వారంతా అతికష్టం మీద కారు డోర్లు ఓపెన్‌ చేసి అందులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. కారు పేలుతుందని తెలిసినా కూడా వారంతా తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ కారులో ఉన్నవారిని కాపాడారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది మరియు పోస్ట్ యొక్క శీర్షిక – ‘రియల్ హీరో’ అని ఉంది – ఈ వీడియో ఎప్పుడు మరియు ఎక్కడ నుండి వచ్చిందో చెప్పలేము అ ఇంత పెద్ద ప్రమాదం ఉన్నప్పటికీ, చాలా మంది ప్రజలు తమ కార్ల నుండి దిగి, కారు డ్రైవర్‌ను మంటల నుండి రక్షించే ప్రయత్నం ప్రారంభించారు. ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు డోర్ తీసి కారు తెరవడానికి ప్రయత్నించారు. కానీ మళ్లీ మళ్లీ నిప్పులు చెరుగుతున్నాడు. ఆ వ్యక్తిని ఎలాగైనా కాపాడేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న చిన్న ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఈ వీడియో చూడండి..

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఈ పోస్ట్‌ క్యాప్షన్‌లో రియల్ హీరోస్‌ అంటూ రాసి ఉంది..ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు. కానీ పోస్ట్ మాత్రం వైరల్‌గా మారింది. 11 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ప్రజలు దీన్ని ఎంతగానో ఇష్టపడ్డారు. వేలాది మంది వీడిపై వ్యాఖ్యానించారు. ఈ వ్యక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదంలో ఉన్నవారిని కాపాడారంటూ వారిపై ప్రశంసలు కురిపించారు. ఈ ప్రపంచం ఎంత అందమైనది. ప్రజలు ఒకరికొకరు తోడుగా ఉంటూ సాయం చేసుకున్నప్పుడు అది మరింత అందంగా మారుతుందని మరొకరు రాశారు. ఇలాంటి సంఘటనలే మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తాయంటూ మరికొందరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..