AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart: విమర్శలకు దారి తీసిన వీడియో.. మగవారికి క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్‌

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్‌ డేస్‌ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దసరా పండగ నేపథ్యంలో అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీగా డిస్కౌంట్స్‌ అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ సేల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఓ యానిమేటెడ్‌ వీడియోను రూపొందించింది. మహిళలకు సంబంధించిన హ్యాండ్‌బ్యాగ్‌లకు సంబంధించి ఓ వీడియోను రూపొందించింది...

Flipkart: విమర్శలకు దారి తీసిన వీడియో.. మగవారికి క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్‌
Flipkart Says Sorry
Narender Vaitla
|

Updated on: Sep 28, 2024 | 8:39 AM

Share

కొన్ని సందర్భాల్లో వ్యాపార ప్రకటనల కోసం చేసే వీడియోలు వివాదాలకు దారి తీసిన సందర్భాల్లో ఎన్నో ఉన్నాయి. వివాదం ముదిరిన సందర్భాల్లో సదరు సంస్థలు స్పందించి క్షమాపణాలు చెప్పిన ఉదాంతాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటనే ఎదురైంది. ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట తీవ్ర దుమారానికి దారి తీసింది. ఈ వీడియోపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగడంతో దెబ్బకు దిగొచ్చిన ఫ్లిప్‌కార్ట్‌ పురుషులకు క్షమాపణలు చెప్పింది. ఇంతకీ ఆ యాడ్‌లో ఏముంది.? అసలు ఫ్లిప్‌కార్ట్ క్షమాపణలు చెప్పడానికి కారణం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్‌ డేస్‌ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దసరా పండగ నేపథ్యంలో అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీగా డిస్కౌంట్స్‌ అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ సేల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఓ యానిమేటెడ్‌ వీడియోను రూపొందించింది. మహిళలకు సంబంధించిన హ్యాండ్‌బ్యాగ్‌లకు సంబంధించి ఓ వీడియోను రూపొందించింది. ఈ వీడియోలో అభ్యంతకర విషయాలను ప్రస్తావించారు.

సేల్‌లో భాగంగా తాము హ్యాండ్‌బ్యాగ్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నామని. మీ భర్తలకు తెలియకుండా కొనుగోలు చేసిన హ్యాండ్‌బ్యాగ్‌లను ఎలా దాచి పెట్టాలో చెబుతూ ఓ యానిమేటెడ్‌ వీడియోను రూపొందించారు. ఈ సందర్భంగా భర్తలను దూషిస్తూ, అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తూ వీడియోను డిజైన్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫ్లిప్‌కార్ట్ తీరుపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.

వివాదానికి దారి తీసిన వీడియో..

కేవలం పురుషులే కాకుండా మహిళలు సైతం ఫ్లిప్‌కార్ట్‌ను తిట్టిపోశారు. మీ ప్రమోషన్స్‌ కోసం మగవారిని దూషిస్తారా అంటూ ఓ రేంజ్‌లో ఫైసర్‌ అయ్యారు. దీంతో ఫ్లిప్‌కార్ట్ ఈ వీడియోపై వెంటనే స్పందించింది. వీడియోను డిలీట్ చేయడంతో పాటు క్షమాపణలు చెప్పింది. ‘ఇలాంటి వీడియో వచ్చినందుకు మేం చింతిస్తున్నాం. తప్పు మాదేనని అంగీకరించాం. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతాం’అంటూ ఫ్లిప్‌కార్ట్‌ క్లారిటీ ఇచ్చింది.

Flipkart

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..