Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త కోడలు నయా టెక్నిక్‌.. చపాతీలు చేసేందుకు ఏం చేసిందో చూసిన అత్తగారు ఆగమైంది..!

వీడియోపై నెటిజన్లు అభిప్రాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. నేటి కోడలు కిచెన్‌ని చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటున్నారని నెటిజన్లు కామెంట్ బాక్స్‌లో పేర్కొన్నారు. కడుపు నింపుకోవడానికి ఆహారాన్ని ఎలా వండుకోవాలో ప్రజలందరూ తెలుసుకోవాలి. కోడలు పిండి పిసికే వరకు అత్తగారు అక్కడే ఉండాల్సిందని మరికొందరు నెటిజన్లు చెప్పారు.

కొత్త కోడలు నయా టెక్నిక్‌..  చపాతీలు చేసేందుకు ఏం చేసిందో చూసిన అత్తగారు ఆగమైంది..!
sas and bahu dough fail funny incident
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 28, 2024 | 9:41 AM

నేటి తరం ఆడవాళ్లు మల్టీ-నేషనల్ కంపెనీలు, అతిపెద్ద ప్రాజెక్ట్‌లను కూడా అతిసులువుగా చేస్తున్నారు. రోడ్లపై నడిచే కారు మొదలు.. ఆకాశంలో ఎగిరే విమానాలు.. అంతరిక్ష ప్రయాణాల్లోనూ తమదైన ముద్రవేసుకున్నారు. కానీ, కొత్తగా పెళ్లైన ఈతరం అమ్మాయిలు కొందరు వంట్టింటి పనులు చేయలేక చెమటలు పడుతున్నారు. అత్తవారింట్లో అడుగుపెట్టిన ఓ కొత్తకోడలు.. అత్త చెప్పిన పనికి అయోమయంలో పడిపోయింది. దెబ్బకు ఆమెకు చుక్కలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఇందులో అత్తగారు చపాతీలు చేయమని చెప్పగా ఆ కొత్త కోడలు ఏం చేసిందో చూస్తే కడుపుబ్బ నవ్వుకోవాల్సిందే..

bridal_lehenga_designn ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో పాపా కి ప్యారీ అని క్యాప్షన్‌లో షేర్‌ చేయబడింది…వీడియో ఆరంభంలో అత్తగారు తన కోడలికి గిన్నెలో పిండి ఇచ్చి, దానిని బాగా మెత్తగా తడపమని చెప్పింది. పిండి సిద్ధమైతే చపాతీలు చేయాలని చెబుతూ దగ్గరకు వచ్చింది.. అత్తగారు చెప్పిన పని చేయకపోతే ఏమంటారోననే కంగారులో ఆ కోడలు పిండిలో ఎక్కువ మొత్తంలో నీళ్లు పోసేసింది..అది అత్తగారు లబోదిబో మంటూ అరుపులు, కేకలు వేయటం మొదలుపెట్టింది. ఇక చేసేది లేక.. నీళ్లు ఎక్కువైన ఆ పిండిలో మరికాస్త పొడి వేసింది.. ఇప్పుడు పిండి తడపమని చెప్పగా,.. మరోమారు ఆ కోడలు.. మరిన్ని నీళ్లు పోసి దోశపిండిలా తయారు చేసింది. నీళ్లు ఎక్కువయ్యాయని పిండి.. పిండి ఎక్కువైందని నీళ్లు పోస్తూ.. వంటింట్లో గందరగోళం సృష్టించింది.. కొత్త కోడలు చేసిన నిర్వాకంతో అత్తగారు విసుగెత్తిపోయారు.. ఏమీ చేయలేక గట్టిగట్టిగా అరవటం మొదలు పెట్టింది. కనీసం పిండి తడపటం కూడా చేతకాని కోడలితో ఎలా వేగాలంటూ తలపట్టుకోవాల్సింది ఆ అత్తగారికి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

bridal_lehenga_designn పేరుతో పోస్ట్‌ చేసిన ఈ రీల్ సెప్టెంబర్ 27న Instagramలో అప్‌లోడ్ చేయబడింది. వీడియోపై నెటిజన్లు అభిప్రాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. నేటి కోడలు కిచెన్‌ని చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటున్నారని నెటిజన్లు కామెంట్ బాక్స్‌లో పేర్కొన్నారు. కడుపు నింపుకోవడానికి ఆహారాన్ని ఎలా వండుకోవాలో ప్రజలందరూ తెలుసుకోవాలి. కోడలు పిండి పిసికే వరకు అత్తగారు అక్కడే ఉండాల్సిందని మరికొందరు నెటిజన్లు చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..