AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ.. ఒకే ఒక్క పాప్‌కార్న్‌ తయారీ కోసం క్యూ కట్టిన నెటిజన్లు.. 8 కోట్లకు పైగా..

ఇక వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఒకరు నాకు కోపం వస్తోంది. నేను ఆ ఒక్క చిన్న పాప్ కోసం నేను ఇంత సమయం ఎదురు చూశానా.. అనుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, చాలా మంది నెటిజన్లు మొత్తం వీడియోను ఎందుకు చూశానా అనుకుని విసుగు చెందుతున్నారు. ఇక్కడ మరింత దయనీయమైన విషయం ఏమిటంటే

వార్నీ.. ఒకే ఒక్క పాప్‌కార్న్‌ తయారీ కోసం క్యూ కట్టిన నెటిజన్లు.. 8 కోట్లకు పైగా..
Popcorn
Jyothi Gadda
|

Updated on: Sep 28, 2024 | 7:00 AM

Share

సోషల్ మీడియాలో ప్రతి రోజూ అనేక రకాలైన వీడియోలు కనిపిస్తుంటాయి. అవన్నీ అతివేగంగా వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే..కొన్ని భయానకంగా కనిపిస్తాయి. మరికొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. మొత్తంమీద ఇటువంటి వీడియోలు ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ కారణంగానే వైరల్‌ వీడియోలకు వ్యూస్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ తాజా వీడియో ఓ మహిళ చేసిన విచిత్ర వంటకానికి సంబంధించింది. ఈ సింపుల్ వీడియోకి వ్యూస్‌ మాత్రం విపరీతంగా వచ్చాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే…

వైరల్‌ వీడియోలో ఒక మహిళ పాన్‌పై పాప్‌కార్న్ చేస్తోంది. అది కూడా కేవలం ఒకే ఒక్క పాప్‌కార్న్ గింజతో చేస్తుంది. దీని కోసం ఆమె ఒక చుక్క నూనె, కొద్దిగా ఉప్పు కూడా వేసింది. ఆ తరువాత ఆమె దానిని చెక్క చెంచాతో అటు ఇటూ కదిలిస్తుంది. ఒక స్లాట్డ్ చెంచా తెచ్చి మొక్కజొన్నపై ఉంచుతుంది. తర్వాత ఏం జరుగుతుందో చూసేందుకు నెటిజన్లు ఆసక్తికరంగా ఎదురు చూడాల్సి వచ్చింది. కొంత సమయం తర్వాత అది పగిలి పాప్‌కార్న్‌గా మారుతుంది. ఈ వీడియో చాలా సింపుల్‌గా ఉంది. అయితే తర్వాత ఏం జరుగుతుందోననే ఆత్రంతో జనాలు మొత్తం వీడియోని చూస్తున్నారు. చివరి వరకు వీడియో చూడకుండా ఆపలేకపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు మొత్తం 8.7 కోట్ల మంది వీక్షణలు రావడానికి కారణం ఇదే.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by Alona Loewen (@alonaloewen)

ఇక వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఒకరు నాకు కోపం వస్తోంది. నేను ఆ ఒక్క చిన్న పాప్ కోసం నేను ఇంత సమయం ఎదురు చూశానా.. అనుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, చాలా మంది నెటిజన్లు మొత్తం వీడియోను ఎందుకు చూశానా అనుకుని విసుగు చెందుతున్నారు. ఇక్కడ మరింత దయనీయమైన విషయం ఏమిటంటే నేను మొత్తం వీడియోను చూశాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..