Viral Video: ‘హవ్వా.. బడిలో ఇవేం పనులు బ్రో!’ సర్కార్ బడిలో మద్యం సేవిస్తూ, బార్ డ్యాన్సర్లతో అశ్లీల నృత్యాలు
బడికి వచ్చిన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, వారి భవిహ్యత్తుకు బాటలు వేయాల్సిన చోట కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఏకంగా స్కూల్లోనే అశ్లీల నృత్యాలు చేస్తూ మద్యం తాగుతూ, బార్ డ్యాన్సర్లతో కలిసి అసభ్యకరంగా డ్యాన్స్‌లు చేశారు. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లోని సహర్సాలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన..
పట్నా, సెప్టెంబర్ 27: బడికి వచ్చిన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, వారి భవిహ్యత్తుకు బాటలు వేయాల్సిన చోట కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఏకంగా స్కూల్లోనే అశ్లీల నృత్యాలు చేస్తూ మద్యం తాగుతూ, బార్ డ్యాన్సర్లతో కలిసి అసభ్యకరంగా డ్యాన్స్‌లు చేశారు. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లోని సహర్సాలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బీహార్‌లోని సహర్సాలోని జలాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పెళ్లి వేడుకల నేపథ్యంలో కొందరు వ్యక్తులు బ్యాండు, నలుగురు బార్ డ్యాన్సర్లను తీసుకొచ్చారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తీసుకొచ్చి తాగి డ్యాన్సులు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. నలుగురు మహిళలు భోజ్‌పురి పాటలకు అసభ్యకరంగా డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. ఆ మహిళల చుట్టూ కొందరు వ్యక్తులు చేరి, మద్యం తాగుతూ వారితో కలిసి డ్యాన్స్ చేయడం వీడియోలో చూడొచ్చు.
बिहार के सरकारी स्कूल में बार बालाओं ने लगाए ठुमके
सहरसा के जलई ओपी क्षेत्र में स्थित विरगांव पंचायत के प्राथमिक विद्यालय नया टोला में बार बालाओं ने जमकर ठुमका लगाया। विडियो 24 सितंबर की रात का बताया जा रहा है। @bihar_police @NitishKumar @BiharEducation_ pic.twitter.com/Jk9Sn0fHhp
— Republican News (@RepublicanNews0) September 26, 2024
సెప్టెంబరు 24 రాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికులకు తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. పిల్లలకు చదువు చెప్పడానికి ఉద్దేశించిన పాఠశాల మైదానంలో ఇలాంటి అసాంఘాక కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో ఇటువంటి వేడుకలను ఎలా అనుమతించారో సమాధానం చెప్పాలని విద్యాశాఖను సైతం ప్రశ్నిస్తున్నారు. మరోవైపుఈ కార్యక్రమానికి తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని జలాయి పోలీసులు తెలిపారు. సామాజిక మాద్యమాల్లో వైరల్ అయిన వీడియో తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు మీడియాకు తెలిపారు. దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెళ్లి బరాత్‌లో భాగంగా కొందరు వ్యక్తులు పాఠశాలలో బస చేసి, వినోదం కోసం ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు.