Train Journey: రైలులో తోటి ప్రయాణికులకు ఆహారం పంచిన డీసెంట్ ఫ్యామిలీ.. అంతలో పోలీసులొచ్చి అరెస్ట్! అసలు యవ్వారం వేరే..
పెద్దింటి మనుషుల్లా అలంకరించుకుని, పెద్ద పెద్ద లాగేజీలతో హడావిడిగా రైలు ఎక్కారు వారంతా. పెద్ద వయసున్న మహిళల, యుక్తవసులో ఉన్న ఇద్దకు యువతీయువకులు.. చకచకా వచ్చి ఎవరి సీట్లలో వాళ్లు కూర్చున్న తర్వాత పక్కసీటుల్లోని వారితో నవ్వుతూ మాట కలిపారు. తామంతా ఒకే కుటుంబమని, తమకు పెద్ద పెద్ద వ్యాపారలు ఉన్నాయని అందరికీ..
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: పెద్దింటి మనుషుల్లా అలంకరించుకుని, పెద్ద పెద్ద లాగేజీలతో హడావిడిగా రైలు ఎక్కారు వారంతా. పెద్ద వయసున్న మహిళల, యుక్తవసులో ఉన్న ఇద్దకు యువతీయువకులు.. చకచకా వచ్చి ఎవరి సీట్లలో వాళ్లు కూర్చున్న తర్వాత పక్కసీటుల్లోని వారితో నవ్వుతూ మాట కలిపారు. తామంతా ఒకే కుటుంబమని, తమకు పెద్ద పెద్ద వ్యాపారలు ఉన్నాయని అందరికీ చెప్పారు. ఆ తర్వాత తమతో తెచ్చుకున్న లగేజీల్లోనుంచి తినుబండారాలు తీసి.. తాము తినడంతోపాటు అక్కడున్న అందరికీ పంచి సరదాగా మాట్లాడుతున్న వారిని హఠాత్తుగా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో అంతా నోరెళ్లబెట్టారు. రైలు మార్గం ద్వారా గుట్టుగా డ్రగ్స్ పరఫరా చేస్తున్న ఈ ముఠాను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళ్తే..
45 ఏళ్ల అనిత, 26 ఏళ్ల అమన్ రాణా, 16 ఏళ్ల యువతి.. కుటుంబం సమేతంగా సుదూర ప్రాంతానికి వెళ్తున్నట్లు భారీ లగేజీతో రైలు ఎక్కారు. చూడ్డానికి సాధారణ మనుషుల్లా, డీసెంట్ ఫ్యామిలీలా కనిపించినా.. వీరు చేసే దందా తెలిస్తే నోరెళ్లబెడతారు. తోటి ప్రయాణికులతో నవ్వుతూ మట్లాడుతూ.. తమతో తెచ్చుకున్న ఆహారాలను వారికి పంచి పెట్టి కబుర్లె చెప్పుకోవడంలో బిజీ అయ్యారు. ఇంతలో పోలీసులు చకచకా వచ్చి మొత్తం కుటుంబాన్ని అరెస్ట్ చేశారు. వాళ్లు డ్రగ్స్ తరలించే ముఠా అని చెప్పడంతో అంతా షాకయ్యారు. స్పెషల్ పోలీస్ కమీషనర్ దేబేష్ శ్రీవాస్తవ నేతృత్వంలో, డ్రగ్స్ స్మగ్లర్లను పట్టుకోవడానికి “కవాచ్ కోడ్” పేరుతో ఈ ఆపరేషన్ ప్రారంభించారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడంతో మొత్తం స్మగ్లింగ్ నెట్‌వర్క్ బట్టబయలైంది. ఇలా వివిధ ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 400 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయి. అక్రమ డ్రగ్స్ రవాణా రింగ్‌లోని మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అడిషనల్ సీపీ సంజయ్ భాటియా, డీసీపీ సతీష్ కుమార్ నేతృత్వంలోని బృందం స్మగ్లర్ల తీరు, వారి రూట్‌లు, డ్రగ్స్ సరఫరా మూలాలపై విచారణ జరిపారు. సరఫరా గొలుసు చివరిలో పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారని, వారి ద్వారా డ్రగ్స్ గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు వెల్లడైంది.
అనిత, అమన్‌లు ఫ్యామిలీ ముసుగులో డ్రగ్స్ విక్రయిస్తున్నారని దర్యాప్తు అధికారులకు ప్రాథమికంగా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఎస్పీ నరేంద్ర బెనియావాల్, క్రైమ్ బ్రాంచ్ అధికారి సందీప్ తుషీర్ కవాచ్ కోడ్ పేరిట స్పెషల్ ఆపరేషన్ చేపట్గారు. దీనిలో భాగంగా రైలులో ప్రయాణిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన 41.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకు, ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.