Bengaluru Murder Case: మహిళను చంపి 59 ముక్కలు చేసిన కేసులో ట్విస్ట్.. సహోద్యోగే హంతకుడు!
బెంగళూరులోని వయ్యాలికావల్ మునేశ్వరబ్లాక్‌లో మహాలక్ష్మీ (29) హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమెను అత్యంత కిరాతకంగా హత్యచేసి, మృతదేహాన్ని 59 ముక్కులుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడింది ఆమె సహోద్యోగని పోలీసులు తేల్చారు. ఇందుకు సంబంధించి వైద్య బృందం శవపరీక్ష నివేదికను విచారణ అధికారులకు అందజేశారు. మరోపక్క వయ్యాలి కావల్ పోలీసులు కేసు దర్యాప్తు..
బనశంకరి, సెప్టెంబర్ 25: బెంగళూరులోని వయ్యాలికావల్ మునేశ్వరబ్లాక్‌లో మహాలక్ష్మీ (29) హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమెను అత్యంత కిరాతకంగా హత్యచేసి, మృతదేహాన్ని 59 ముక్కులుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడింది ఆమె సహోద్యోగని పోలీసులు తేల్చారు. ఇందుకు సంబంధించి వైద్య బృందం శవపరీక్ష నివేదికను విచారణ అధికారులకు అందజేశారు. మరోపక్క వయ్యాలి కావల్ పోలీసులు కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనా స్థలంలో, ఫ్రిడ్జ్‌పై దొరికిన వేలి ముద్రల ఆధారంగా సహోద్యోగి అని పోలీసులు గుర్తించారు. అయితే అతడు హత్య అనంతరం పరారీలో ఉన్నాడు. మహాలక్ష్మీ హత్య వెనుక హంతకుడు ఒక్కరేనా లేక ఇద్దరా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసుకు సంబంధించి అనుమానిత హంతకుడి సోదరుడిని పిలిపించి సుమారు 2 గంటల పాటు విచారణ చేపట్టిన పోలీసులు సమాచారం రాబట్టారు. మృతురాలు మహలక్ష్మీ భర్తతో విడిపోయిన తర్వాత బెంగళూరు చేరుకుని, అక్కడే మల్లేశ్వరరంలోని ఓ బట్టల షాపింగ్ మాల్‌లో పని చేస్తూ ఉండేది. అయితే ఒడిశా చెందిన రంజన్ రాయ్ అనే వ్యక్తి కూడా అదే షాపింగ్ మాల్‌లో పనిచేసేవాడు. వీరిద్దరికీ 2023లో పరిచయం ఏర్పిడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర బంధానికి దారి తీసింది. ఆమెకు హేమంత్ దాస్ అనే వేరొక వ్యక్తితో చనువుగా ఉంటుందన్న కారణంతో ముక్తి ఆరునెలలు క్రితం ఆమెను విడిచిపెట్టాడు. దీంతో అప్పటి నుంచి మహలక్ష్మీ కూడా అతనికి దూరంగా ఉండసాగింది. ఈ క్రమంలో ఆమెపై రంజన్ రాయ్ పగ పెంచుకున్నాడు. ఆ కారణంగానే ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఈ మేరకు హంతకుడు మహాలక్ష్మిని తానే హత్య చేసినట్లు తన సోదరుడికి ఫోన్‌లో చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో హంతకుడి సోదరుడితోపాటు మరో ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు.
కాగా వయాలికావల్‌లోని మున్నేశ్వర్ బ్లాక్ మొదటి అంతస్తులో మహాలక్ష్మి అనే వివాహితను 59 ముక్కలుగా నరికి ఆమె మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. శరీర భాగాలు నాలుగైదు రోజులుగా ఫ్రిజ్‌లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన మహాలక్ష్మి స్వస్థలం కర్నాటక కాదు. ఆమె వేరే రాష్ట్రం నుంచి వచ్చి బెంగళూరులో గత కొంతకాలంగా షాపింగ్ మాల్లో పనిచేస్తూ ఒంటరిగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 21న ఉదయం ఆమెను చూసేందుకు తల్లి, చెల్లెలు రావడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
హంతకుడు ఆత్మహత్య
గత మూడు రోజులుగా మహాలక్ష్మిని హత్య చేసిన నిందితుడు రంజన్ రాయ్ కోసం పోలీసులు ఒడిశా-పశ్చిమ బెంగాల్ సరిహద్దు సమీపంలో తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే అతడు బుధవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల భయంతోనే, మరేదైనా కారణం చేత ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయం తెలియాల్సి ఉంది.