Mobile: కొత్త ఫోన్‌ కొన్నందుకు పార్టీ ఇవ్వలేదని.. కత్తితో పొడిచి చంపిన స్నేహితులు

ఢిల్లీలోని షకర్‌పూర్‌కు చెందిన సచిన్‌ అనే 16 యేళ్ల యువకుడు కొత్త ఫోన్ కొనుగోలు చేయడానికి షాపుకు వెళ్లాడు. సెప్టెంబర్ 23 సాయంత్రం 7 గంటల సమయంలో సచిన్ కొత్త మొబైల్ ఫోన్ కొని ఇంటికి తిరిగి వస్తుండగా ఓ చిరుతిండి దుకాణం దగ్గర సచిన్‌ స్నేహితులు ఎదురయ్యారు. సచిన్ వద్ద కొత్త ఫోన్..

Mobile: కొత్త ఫోన్‌ కొన్నందుకు పార్టీ ఇవ్వలేదని.. కత్తితో పొడిచి చంపిన స్నేహితులు
Teen Stabbed To Death For Mobile
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 24, 2024 | 8:15 PM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఫోన్‌ కొన్నందుకు పార్టీ ఇవ్వలేదనీ తోటి స్నేహితులు దారుణానికి ఒడిగట్టారు. 16 యువకుడు ఫోన్‌ కొన్న సంగతి తన తోటి స్నేహితులకు తెలిపాడు. అయితే వారంతా సదరు యువకుడిని పార్టీ అడిగారు. ఈ విషయమై వాగ్వాదం చోటుచేసుకోగా అతడి స్నేహితులు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని షకర్‌పుర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఢిల్లీలోని షకర్‌పూర్‌కు చెందిన సచిన్‌ అనే 16 యేళ్ల యువకుడు కొత్త ఫోన్ కొనుగోలు చేయడానికి షాపుకు వెళ్లాడు. సెప్టెంబర్ 23 సాయంత్రం 7 గంటల సమయంలో సచిన్ కొత్త మొబైల్ ఫోన్ కొని ఇంటికి తిరిగి వస్తుండగా ఓ చిరుతిండి దుకాణం దగ్గర సచిన్‌ స్నేహితులు ఎదురయ్యారు. సచిన్ వద్ద కొత్త ఫోన్ చూసిన వారంతా తమకు పార్టీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే తన వద్ద డబ్బు లేదనీ.. పార్టీ ఇవ్వలేనని చెప్పాడు. సచిన్‌ పార్టీ ఇచ్చేందుకు నిరాకరించడంతో వారిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్త తీవ్రమవ్వడంతో ఘర్షణకు దారితీసింది.

ఈ పెనుగులాటలో ఓ యువకుడు సచిన్‌ను వెనుక నుంచి కత్తితో రెండు సార్లు పొడిచాడు. సచిన్ ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోవడంతో వారంతా పారిపోయారు. వెంటనే స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించి, చుట్టుపక్కలవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే సచిన్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల సహాయంతో నిందితులు ముగ్గురు మైనర్లుగా గుర్తించారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మైనర్లు కావడంతో పోలీసులు జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేస్తున్నారు. మృతదేహాం వెనుక భాగంలో రెండు కత్తిపోట్లు ఉన్నట్లు ఉన్నట్లు గుర్తించామని, ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇతర నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.