School Principal: ఓరి దుర్మార్గుడా.. ఆరేళ్ల చిన్నారిని చంపి స్కూల్లోనే పాతిపెట్టిన ప్రిన్సిపల్!

గుజరాత్లోని దాహోద్లో ఘోర సంఘటర జరిగింది. స్కూల్‌ ప్రిన్సిపల్ ముక్కుపచ్చలారని ఓ చిన్నారిని దారుణంగా చంపి, స్కూల్లోనే పాతిపెట్టాడు. అనంతరం ఏమీ ఎరగనట్లు స్కూల్లో నాటకాలు ఆడసాగాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా నేరం అంగీకరించాడు..

School Principal: ఓరి దుర్మార్గుడా.. ఆరేళ్ల చిన్నారిని చంపి స్కూల్లోనే పాతిపెట్టిన ప్రిన్సిపల్!
School Principal
Follow us

|

Updated on: Sep 24, 2024 | 6:36 PM

దోహద్‌, సెప్టెంబర్ 24: గుజరాత్లోని దాహోద్లో ఘోర సంఘటర జరిగింది. స్కూల్‌ ప్రిన్సిపల్ ముక్కుపచ్చలారని ఓ చిన్నారిని దారుణంగా చంపి, స్కూల్లోనే పాతిపెట్టాడు. అనంతరం ఏమీ ఎరగనట్లు స్కూల్లో నాటకాలు ఆడసాగాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా నేరం అంగీకరించాడు. వివరాల్లోకెళ్తే..

గుజరాత్‌లోని దోహాద్ జిల్లాలోని పిపాలియాలోని ఒక ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్ గోవింద్ నట్ (55) ఒకతో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని(6)ని స్కూల్కు తీసుకెళ్లేందుకు ఇంటి వద్ద కారులో ఎక్కించుకున్నాడు. అయితే ఆ రోజు సాయంత్రం బాలిక ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మొత్తం 10 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఈ నెల 19వ తేదీన చిన్నారి మృత దేహం పాఠశాల కాంపౌండ్‌లో లభ్యమైంది. పోస్టుమార్టం నిర్వహించగా.. ఊపిరాడక చిన్నారి మృతి చెందినట్లు తేలింది. దర్యాప్తులో వారికి విస్తుపోయే నిజాలు తెలిశాయి.

బాలిక కనిపించకుండా పోయిన రోజు (సెప్టెంబరు 19) ప్రిన్సిపల్ అతని కారులో పాఠశాల వద్ద డ్రాప్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ రోజు బాలిక పాఠశాలకు రాలేదని విద్యార్థులు, ఉపాధ్యాయులు పోలీసులకు చెప్పారు. అదే రోజు సాయంత్రం స్థానికులతో కలిసి బాలిక తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకోగా, వారు గేటు సమీపంలో బాలిక వస్తువులను గుర్తించారు. దీంతో కేసు ప్రిన్సిపల్‌ చుట్టూ తిరగసాగింది. విచారణ నిమిత్తం పోలీసులు గోవింద్‌ నట్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు నిజం చెప్పాడు.

ఇవి కూడా చదవండి

బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా.. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించినప్పుడు, అరవడం ప్రారంభించిందని.. బాలిక అరుపులను ఆపేందుకు గట్టిగా ఆమె నోటిపై చేతులు పెట్టానని, దీంతో ఊపిరాడక బాలిక మృతి చెందినట్లు నేరం అంగీకరించాడు. బాలిక చనిపోవడంతో, కారు వెనుక భాగంలో దాచి.. ఆ తర్వాత గోవింద్ నట్ ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లాడు. అదే రోజు సాయంత్రం పాఠశాల ముగిసిన తరువాత, కారు వద్దకు తిరిగి వచ్చి, బాలిక బ్యాగ్‌, ఇతర వస్తువులను పాఠశాల గేటు దగ్గర పడవేసి, తరగతి గది వెనుక బాలికను పాతిపెట్టినట్లు తెలిపాడు. నిందితుడిని గత ఆదివారం అదుపులోకి తీసుకున్నామని ఈ మేరకు కేసు వివరాలను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజ్‌దీప్‌సిన్హ్ జాలా మీడియాకు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.