Viral News: బట్టలుతకడంలో నిమగ్నమైన తల్లి.. కాలువలో కొట్టుకుపోయిన నాలుగేళ్ల చిన్నారి! ఎక్కడంటే..
వర్షాకాలంలో దేశమంతా వరదలతో అతలాకుతలం అవుతున్నా ఆ గ్రామంలో మాత్రం నీటి కష్టాలు పట్టించుకునే నాథుడే లేడు. అవసరాలకు సరిపడా నీళ్లులేకపోవడంత కాలువ ఒడ్డున ఓ మహిళ బట్టలు ఉతుకడానికి వచ్చింది. ఆమెతోపాటు 4 యేళ్ల కూతురు కూడా అక్కడికి వచ్చింది. బట్టలు ఉతకడంలో నిమగ్నమైన మహిళ...
పూణె, సెప్టెంబర్ 25: వర్షాకాలంలో దేశమంతా వరదలతో అతలాకుతలం అవుతున్నా ఆ గ్రామంలో మాత్రం నీటి కష్టాలు పట్టించుకునే నాథుడే లేడు. అవసరాలకు సరిపడా నీళ్లులేకపోవడంత కాలువ ఒడ్డున ఓ మహిళ బట్టలు ఉతుకడానికి వచ్చింది. ఆమెతోపాటు 4 యేళ్ల కూతురు కూడా అక్కడికి వచ్చింది. బట్టలు ఉతకడంలో నిమగ్నమైన మహిళ.. బకెట్ నీళ్లలో కొట్టుకుపోవడం గమనించి దానికోసం నీళ్లలోకి దిగింది. తల్లి వెంటనే చిన్నారి కూడా కాలువలో దిగడంలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. అప్పటి వరకూ తనకళ్లెదుటే ఉన్న చిన్నారి నీళ్లపాలవడంతో మహిళ లబోదిబో మంటూ బిడ్డ కోసం రోధిస్తూ పోలీసుల వద్దకు పరుగు తీసింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా చిన్నారి మృతదేహం అదే రోజు సాయంత్రం లభ్యమైంది. ఈ ఘటన మహారాష్ట్రలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
మహారాష్ట్రలోని కొలెవాడి మహాదేవ్ ఆలయం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. కోలేవాడి గ్రామానికి చెందిన మాధురి (4) తన తల్లితో కలిసి కోలేవాడిలోని మహాదేవ్ ఆలయం ప్రక్కనే ఉన్న కాలువ వద్దకు వెళ్లింది. అక్కడ బాలిక తల్లి బట్టలు ఉతుకుతుండగా, ఆమె తీసుకొచ్చిన బకెట్ ఒకటి నీళ్లలో కొట్టుకుపోసాగింది. బాలిక తల్లి దాని కోసం నీళ్లలోకి వెళ్లింది. ఒడ్డున కూర్చున్న మాధురి తల్లి ఎక్కడికో వెళ్లిపోతుందని భావించి.. నీళ్లలో దిగి తల్లిని అనుసరించింది. దీంతో నీళ్ల ప్రవాహం దాటికి బాలిక కొట్టుకుపోయింది. ప్రమాద సమాచారం అందుకున్న కత్రాజ్ అగ్నిమాపక దళ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. మంగళవారం సాయంత్రం సాయంత్రం 6 గంటలకు బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు. మరో పట్టణంలో నివసించే మాధురి ఘటన జరగడానికి నాలుగు రోజుల క్రితమే కోలెవాడిలోని తల్లి వద్దకు వచ్చింది.
ఈ విషాద ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. మధురీ తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని స్థానికులు వెల్లడించారు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు మాధురి మృతికి దారితీసిన పరిస్థితులపై ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలం ముగింపుకు వస్తున్నా తమ గ్రామంలో నీటి కష్టాలు తీరడం లేదనీ వాపోయారు. సర్కార్ తమ గ్రామానికి సరిపడా నీళ్లు సరఫరా ఉంటే బాలిక తల్లి బట్టలు ఉతికేందుకు కాలువకు ఎందుకు పోతుందని ప్రశ్నించారు. తమ గ్రామంలో వర్షాకాలంలో కూడా ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకురావాల్సి వస్తుందని, ‘ఈ నష్టానికి బాధ్యులెవరు?’ అని గ్రామస్తులు నిలదీస్తున్నారు.