AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న కారు.. తొంగి చూస్తే, ఐదుగురి మృతదేహాలు..!

తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు పుదుకోట్టై సమీపంలో కారులో ఆత్మహత్య చేసుకున్నారు.

Tamil Nadu: జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న కారు.. తొంగి చూస్తే, ఐదుగురి మృతదేహాలు..!
Tamil Nadu Tragedy
Balaraju Goud
|

Updated on: Sep 25, 2024 | 3:33 PM

Share

తమిళనాడులో  తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు పుదుకోట్టై సమీపంలో కారులో ఆత్మహత్య చేసుకున్నారు. పుదుకోట్టై జిల్లా పుదుకోట్టై సమీపంలోని ఇలంగుడిపట్టి సమీపంలోని తిరుచ్చి – కరైకుడి మధ్య జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారు నుండి 5 మంది, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులు ఐదుగురు సేలం జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారని విచారణలో తేలింది. మణికందన్, అతని తల్లి సరోజ, భార్య నిత్య, కుమారుడు తీరన్, కుమార్తె నిగరిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వేలిముద్రలు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురి మృతదేహాలను మూడు అంబులెన్స్‌లలో పోస్టుమార్టం నిమిత్తం పుదుకోట్టై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణ కొనసాగుతోంది. వ్యాపారంలో నష్టం రావడంతో మణికందన్‌ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో పోలీసులకు సమాచారం అందింది. కారులో ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించి
వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించి
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ముందడుగు!
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ముందడుగు!
Gold rate : మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Gold rate : మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు
శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
మహేష్ బాబు సినిమాలో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.?
మహేష్ బాబు సినిమాలో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.?
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆ ఖర్చులో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా రికార్డ్‌!
ఆ ఖర్చులో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా రికార్డ్‌!
మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు 2026 విడుదల..ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్
మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు 2026 విడుదల..ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్
బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు విచిత్ర వాతావరణం
బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు విచిత్ర వాతావరణం