- Telugu News Photo Gallery Do this before sleeping at night to Reduce Weight Without Diet or Exercise
రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేస్తే ఈజీగా సన్నబడతారు..! ట్రై చేసి చూడండి..
ఊబకాయం అనేది ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్య. ఇది మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. బరువు పెరగడాన్ని నియంత్రించడానికి చాలా మంది గంటల తరబడి జిమ్‌లో శ్రమిస్తుంటారు. డైట్ పేరుతో సగం కడుపుకే ఆహారం తీసుకుంటున్నారు. అయితే దీని వల్ల ఉపయోగం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ, మనం తీసుకునే ఆహారం, జీవనశైలి మార్పుల ద్వారా కూడా సులభంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Sep 27, 2024 | 1:35 PM

అయితే అధిక బరువు ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సమస్యలు ఉండవు. ఆరోగ్యకరమైన ఆహారం, చురుకైన జీవనశైలితో ఎవరైనా తమ బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

భోజనం మానేయడం, డైటింగ్ చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు అనుకుంటారు చాలా మంది. కానీ, మనం తీసుకునే ఆహారం, జీవనశైలి మార్పుల ద్వారా సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. మీరు బరువు తగ్గాలనుకుంటే రాత్రి 7 గంటలలోపు తినడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.

రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య దాదాపు 3 గంటల గ్యాప్ ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రిపూట లేట్‌గా భోజనం చేయడం వల్ల జీర్ణం సరిగా అవదు. దీంతో జీవక్రియ ప్రభావితం అవుతుంది. దీని కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే, సాయంత్రం త్వరగా తినడం అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు.

వయస్సు వారీగా బరువు గురించి చెప్పాలంటే.. 12 నుండి 14 సంవత్సరాల వయసు వారు 32-36 కిలోలు, 15 నుంచి 20 సంవత్సరాల వారు 45 కిలోలు, 21 నుండి 30 సంవత్సరాలు 50-60 కిలోలు, 31 నుండి 40 సంవత్సరాలు 60-65 కిలోలు , 41 నుండి 60 సంవత్సరాల వారు 59-63 కిలోలు. . ఉండాలి. అంటే ఒక వ్యక్తి వయస్సును బట్టి బరువు ప్రమాణాలు పెరుగుతాయన్నమాట.

మనం త్వరగా నిద్రపోవడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ మన శరీరంలో బ్రౌన్ ఫ్యాట్‌ని సృష్టించి కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి బాగా నిద్రపోవడం వల్ల శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది, ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఊబకాయం అనేది అటు నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. బరువు తగ్గడానికి కనీసం 7 గంటల గాఢ నిద్ర అవసరం. మీకు తగినంత నిద్ర లేకపోతే, అది మీ జీవక్రియను నెమ్మదిస్తుంది. దీంతో బరువు తగ్గడం కష్టంగా మారుతుంది. ఇక మంచి నిద్ర కోసం రాత్రి పుకునే ముందు పసుపు పాలు తాగడం అలవాటు చేసుకోంది. పసుపు పాలు బరువు తగ్గడానికి, మంచి నిద్రకు సహాయపడుతుంది.




