- Telugu News Photo Gallery Ghee Purity Test: How can you test the purity of ghee easily at home? Know here
Ghee Purity Test: మీ ఇంట్లో నెయ్యి అసలా..? కల్తీనా? ఇలా తెలుసుకోండి..
వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని, దోసెడు నెయ్యి కలుపుకు తింటే ఆ రుచే వేరు. అయితే ఇంట్లో తయారు చేసిన నెయ్యితో ఎలాంటి సమస్య లేదు. కానీ మార్కెట్లో రకరకాల నెయ్యి బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అసలు ఏదో.. కల్తీ ఏదో తెలియక చాలామంది తికమక పడుతుంటారు. ఇదే అదనుగా కల్తీ రాయుళ్లు వెజిటబుల్ ఆయిల్, జంతు కొవ్వు, మినరల్ ఫ్యాట్, స్టార్చ్ వంటి ఇతర పదార్దాలను కలిపి కల్తీ నెయ్యి యదేచ్ఛగా
Updated on: Sep 28, 2024 | 1:15 PM

వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని, దోసెడు నెయ్యి కలుపుకు తింటే ఆ రుచే వేరు. అయితే ఇంట్లో తయారు చేసిన నెయ్యితో ఎలాంటి సమస్య లేదు. కానీ మార్కెట్లో రకరకాల నెయ్యి బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అసలు ఏదో.. కల్తీ ఏదో తెలియక చాలామంది తికమక పడుతుంటారు. ఇదే అదనుగా కల్తీ రాయుళ్లు వెజిటబుల్ ఆయిల్, జంతు కొవ్వు, మినరల్ ఫ్యాట్, స్టార్చ్ వంటి ఇతర పదార్దాలను కలిపి కల్తీ నెయ్యి యదేచ్ఛగా అమ్ముతుంటారు. అయితే మీరు మార్కెట్లో కొనుగోలు చేసిన నెయ్యి స్వచ్ఛమైనదా.. కాదా అనే విషయం తేలిగ్గా గుర్తించొచ్చు. ఎలాగంటే..

అరచేతిలో ఒక చెంచా నెయ్యి తీసుకుని మెత్తగా రుద్దాలి. అరచేతిలో నెయ్యి కరిగితే అది స్వచ్ఛమైన నెయ్యి అని అర్థం. అరచేతిలో గట్టి పదార్ధం కరగకుండా అలాగే ఉండిపోతే అందులో కల్తీ పదార్థం కలిసి ఉందని అర్ధం. అలాగే కొద్ది మొత్తంలో నెయ్యి తీసుకొని పారదర్శక సీసాలో వేయాలి. దానికి కొద్దిగా చక్కెర జోడించాలి. ఆ తర్వాత సీసా మూత మూసివేసి బాగా షేక్ చేయాలి. కాసేపటి తర్వాత సీసా అడుగున ఎర్రటి చారలు కనిపిస్తే.. ఈ నెయ్యి కల్తీ అని అర్ధం చేసుకోవాలి.

కల్తీని గుర్తించేందుకు మార్కెట్ నుంచి తెచ్చే నెయ్యిలో నాలుగైదు చుక్కల అయోడిన్ వేయాలి. నెయ్యి నీలం రంగులోకి మారితే కల్తీ అని అర్థం. నెయ్యి నాణ్యతను గుర్తించేందుకు చేతికి కాస్త నెయ్యి రాసి రెండు చేతులతో బాగా రుద్దాలి. సువాసనగా ఉంటే అది స్వచ్ఛమైన నెయ్యి. కొంత సమయం తర్వాత నెయ్యి వాసన పోతే అది కల్తీ నెయ్యి.

స్వచ్ఛమైన నెయ్యి అయితే అది పూసలా ఉంటుంది. వేడిచేసినప్పుడు నూనెలా కనిపిస్తుంది. అలాగే నెయ్యి ఉపరితలంపై తెట్టులా ఏర్పడినా.. కరిగిన నెయ్యి లేత పసుపు, తెలుపు రంగులో ఉన్నా అది ఖచ్చితంగా నకిలీ నెయ్యి.

కొందరు నెయ్యిలో వంట నూనె కలుపుతారు. మీరు వినియోగించే నెయ్యిలో నూనె కలిసిందో లేదో తెలుసుకోవాలంటే నెయ్యి వేడి చేసి ఫ్రిజ్ లో పెడితే రెండు పొరలుగా ఏర్పడితే అది కల్తీ. నెయ్యి, ఇతర నూనె వేర్వేరు పొరలుగా ఉంటే కల్తీ నెయ్యిగా అర్ధం చేసుకోవాలి.




