ప్రస్తుత కాలంలో ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి తరుణంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.. అలాంటి మంచి ఆహారంలో కీర దోసకాయ ఒకటి.. ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహారం.. కీర దోసను డైలీ తినడం వల్ల డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందడమే కాకుండా మన మెదడు బలాన్ని పెంచడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హెల్తీ ఫుడ్స్ విషయానికి వస్తే.. దోసకాయ చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని సలాడ్ గా లేదా.. జ్యూస్ గా తీసుకోవచ్చు.. విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఇందులో లభిస్తాయి. అయితే, కీర దోసకాయలోని ఫిసెటిన్.. ఒక సహజమైన ఫ్లేవనాయిడ్.. ఇది జ్ఞానాన్ని పెంచడంతోపాటు.. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కీర దోసకాయను రెగ్యులర్ గా తినేవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి..