AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ.. ఇదేం పిచ్చిరా నాయనా.. బర్త్‌డే గిఫ్ట్‌గా యువకుడి ప్రైవేట్ పార్ట్‌కు నిప్పంటించిన ఫ్రెండ్స్..ఏం జరిగిందంటే..

ఒక యువకుడి బర్త్‌డే సందర్భంగా అలాంటి ఊహించని గిఫ్ట్‌ ఇచ్చారు కొందరు స్నేహితులు.. ఆ గిఫ్ట్‌ అందుకున్న వ్యక్తికి మాత్రం పుట్టిన రోజునాడే.. చావు తప్పినట్టైంది.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వార్నీ.. ఇదేం పిచ్చిరా నాయనా.. బర్త్‌డే గిఫ్ట్‌గా యువకుడి ప్రైవేట్ పార్ట్‌కు నిప్పంటించిన ఫ్రెండ్స్..ఏం జరిగిందంటే..
friends set fire to the private part of a young boy
Jyothi Gadda
|

Updated on: Sep 27, 2024 | 12:34 PM

Share

పుట్టిన రోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక గొప్ప రోజు. అందుకే బర్త్ డే రోజు కొందరు సెలబ్రెట్ చేసుకుంటారు. బంధువులు, ఫ్రెండ్స్‌కి పార్టీలు ఇస్తుంటారు. మరికొందరు పుట్టిన రోజు సందర్భంగా అన్నదానం చేస్తుంటారు. మరి కొందరమో తమ బర్త్ డే వినూత్నంగా జరుపుకుంటారు. ఇక, ఫ్రెండ్స్‌ సర్కిల్‌లో ఒకరి బర్త్‌డే అంటే.. ఆ గ్యాంగ్ అంతా సందడి చేస్తారు. బర్త్‌డే ఉన్న వారికి సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేస్తుంటారు. కేక్‌ కట్టింగ్‌, మందు విందు వంటివి ఏర్పాటు చేసుకుంటారు. రాత్రి 12 గంటలు దాటగానే బర్త్‌డే సెలబ్రేషన్స్‌ మొదలుపెట్టేస్తుంటారు. ఇక్కడ కూడా ఒక యువకుడి బర్త్‌డే సందర్భంగా అలాంటి ఊహించని గిఫ్ట్‌ ఇచ్చారు కొందరు స్నేహితులు.. ఆ గిఫ్ట్‌ అందుకున్న వ్యక్తికి మాత్రం పుట్టిన రోజునాడే.. చావు తప్పినట్టైంది.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ మారిన ఈ వీడియో ఘర్‌కే కాలేష్ అనే ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. వీడియోలో ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నాడు. అయితే అప్పుడే వచ్చిన అతని ఫ్రెండ్స్ వెరైటీగా సర్‌ప్రైజ్ చేద్దామనుకున్నారో ఏమో గానీ,.. స్ప్రే బాటిల్‌తో అతని రూమ్‌కు వచ్చి అతని అండర్ ప్యాంట్‌కు నిప్పంటించి.. హ్యాపీ బర్త్‌ డే టూ యూ అంటూ గట్టిగా పాడసాగారు. దీంతో సడెన్‌గా లేచిన ఆ యువకుడు నిప్పును చూసి ఒక్కసారిగా భయపడిపోయాడు.. వెంటనే ఆ మంటను చల్చార్చే ప్రయత్నం చేశాడు.. అనంతరం వాళ్లని కొట్టడానికి వెళ్లాడు. కానీ కాసేపు ఆగిన తర్వాత అతని కోపం చల్లారి వాళ్ళతో కలిసిపోయాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా ఉందని కొందరు.. ఇది చాలా డేంజర్‌ సర్‌ప్రైజ్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..