AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేయ్‌.. ఎవర్రా మీరంతా..! ఎలా వస్తాయి మీకు ఇలాంటి ఐడియాలు.. ట్రక్కుకు వేలాడుతూ ఏం చేస్తున్నాడంటే..

ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు జిమ్‌కు వెళ్లే అవకాశం లేక.. ఎలాగైనా వ్యాయామం చేయాలని అనుకున్నాడో ఏమో గానీ.. చివరకు లారీనే జిమ్ సెంటర్‌గా మార్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వేగంగా వైరల్‌ అవుతోంది.

రేయ్‌.. ఎవర్రా మీరంతా..! ఎలా వస్తాయి మీకు ఇలాంటి ఐడియాలు.. ట్రక్కుకు వేలాడుతూ ఏం చేస్తున్నాడంటే..
Man Does Gym On Truck,
Jyothi Gadda
|

Updated on: Sep 27, 2024 | 11:21 AM

Share

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొందరు యువతీ యువకులు చేసే విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. బస్సులు, రైళ్లలో డాన్సులు వేసే మహిళలతో పాటూ ఇళ్లల్లో చిత్ర చిత్రమైన పనులు చేసే వ్యక్తులను నిత్యం సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉంటాం. తాజాగా…ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు జిమ్‌కు వెళ్లే అవకాశం లేక.. ఎలాగైనా వ్యాయామం చేయాలని అనుకున్నాడో ఏమో గానీ.. చివరకు లారీనే జిమ్ సెంటర్‌గా మార్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వేగంగా వైరల్‌ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇక్కడ వైరల్‌గా మారిన వీడియోలో రోడ్డుపై ఒక ట్రక్కు వెళ్తోంది. ఈ ట్రక్కు వెనకాల ఒక యువకుడు విచిత్రంగా జిమ్‌ చేయటం కనిపింది. ఆ ట్రక్కు వెనకాల వెనుక వైపు కింద బంపర్ మధ్యలో కాళ్లు పెట్టి, మెడ కింద పెట్టి పైకి, కిందకు శరీరాన్ని కదిలిస్తూ వ్యాయామం చేస్తున్నాడు. కాళ్ల సాయంతో కిందపడకకుండా గట్టిగా పట్టుకుని ఈ ఫీట్ చేశాడు.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

ఆ ట్రక్కు వెనకాలే వస్తున్న కారులో ఉన్న వ్యక్తులు ఇదంతా వీడియో రికార్డ్‌ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది కాస్త వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఇదేం పిచ్చి పని అంటూ కొందరు కామెంట్‌ చేయగా, మరికొందరు ఇది ప్రాణాలతో చెలగాటం అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఈ ఆకులు కూరల్లో వేస్తే ఘుమఘుమలేకాదు మీ ఆరోగ్యానికీ ఎంతో మేలు..!
ఈ ఆకులు కూరల్లో వేస్తే ఘుమఘుమలేకాదు మీ ఆరోగ్యానికీ ఎంతో మేలు..!
నా సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా రెడీ అయ్యింది
నా సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా రెడీ అయ్యింది
పండగ పూట పోచమ్మ తల్లి ఆలయంలో నాగు పాము అద్భుత దర్శనం
పండగ పూట పోచమ్మ తల్లి ఆలయంలో నాగు పాము అద్భుత దర్శనం
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన మెటల్ రేట్లు...
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన మెటల్ రేట్లు...
హాట్ సమ్మర్‌లో కేరళలోని ఈ బ్యూటిఫుల్ కూల్ ప్రదేశాలను తప్పక చూడండి
హాట్ సమ్మర్‌లో కేరళలోని ఈ బ్యూటిఫుల్ కూల్ ప్రదేశాలను తప్పక చూడండి
ఇది మైలేజీలో రారాజు.. 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్‌!
ఇది మైలేజీలో రారాజు.. 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్‌!