Viral News: ఏం మాయో ఇది..! పాము కరిచినా చనిపోరు.. ఈ గుడికి వస్తే అసలేమీ కాదట.. ఎక్కడంటే

ఆ రాజు ఏకాంత జీవితం గడుపుతూ ఇక్కడే సమాధి అయ్యాడని చెప్పాడు. ఈ ఆలయం అదే స్థలంలో నిర్మించబడిందని చెప్పుకొచ్చాడు. ఆ తరువాతి కాలంలో ఒక వ్యక్తి పాము కాటుకు గురైనప్పుడు ఈ ఆలయంలో ఒక అద్భుతం జరిగింది. పాము కాటుకు గురైన కుమారుడిని రక్షించుకునేందుకు

Viral News: ఏం మాయో ఇది..! పాము కరిచినా చనిపోరు.. ఈ గుడికి వస్తే అసలేమీ కాదట.. ఎక్కడంటే
Snake Bite
Follow us

|

Updated on: Sep 27, 2024 | 9:04 AM

పాము కాటుకు గురైన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలి.. లేదంటే, ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. కానీ, మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో పాముకాటుకు గురైన వారిని వెంటనే అక్కడి బిదేహి బాబా గుడికి తీసుకువెళ్తారు..పాము కాటుతో ఈ గుడికి వచ్చిన వ్యక్తి కోలుకుంటాడని ఇక్కడి ప్రజల నమ్మకం. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో మహారాజ్‌పూర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో పాము కాటు వల్ల ఎవరూ చనిపోరు అని మీకు తెలుసా? మహారాజ్‌పూర్ గ్రామంలో ఎవరైనా పాము కాటుకు గురైతే, వారు ఆసుపత్రికి వెళ్లకుండా వైద్యం కోసం బిదేహి బాబా ఆలయాన్ని సందర్శిస్తారని అనాదిగా ఉన్న నమ్మకం. పాముకాటుకు గురైన వ్యక్తి సజీవంగా ఇక్కడికి వస్తే, అతను కోలుకున్న తర్వాతే తిరిగి ఇంటికి వెళ్తాడని ఇక్కడి ప్రజల బాగా నమ్ముతారు.

సమాచారం ప్రకారం.. బిదేహి బాబా ఆలయ పూజారి రాజ్‌కుమార్ తివారీ కూడా దీనిని ధృవీకరించారు. రాజుల కాలం నుంచి ఇక్కడ ఇలాంటి అద్భుతాలు అనేకం జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. పాము కాటుకు గురైనవారు ఈ ఆలయానికి వస్తే ప్రాణపాయం తప్పుతుందని, దీని వెనుక బిదేహి బాబా మహత్యం ఉందని చెబుతున్నారు. ఈ ఆలయంలో ఒక భారీ నాగుపాము కూడా ఉంటుందని, దానిని పూజారులు చూసుకుంటారని పేర్కొన్నారు.

పూజారి ఈ ఆలయ చరిత్రను వివరించాడు.. ఆలయ నిర్మాణం వెనుక ఐహిక వ్యవహారాలను వదిలి అడవికి వెళ్లి ఒంటరి జీవితం గడిపిన ఒక రాజు చరిత్రను వివరించాడు. ఆ రాజు ఏకాంత జీవితం గడుపుతూ ఇక్కడే సమాధి అయ్యాడని చెప్పాడు. ఈ ఆలయం అదే స్థలంలో నిర్మించబడిందని చెప్పుకొచ్చాడు. ఆ తరువాతి కాలంలో ఒక వ్యక్తి పాము కాటుకు గురైనప్పుడు ఈ ఆలయంలో ఒక అద్భుతం జరిగింది. పాము కాటుకు గురైన కుమారుడిని రక్షించుకునేందుకు వృద్ధ తల్లి బిదేహి బాబా వద్దకు చేరుకుంది. ఈ సమయంలో బాబా తన కొడుకుకు ఏమీకాదని ఆ తల్లికి వాగ్దానం చేశారు. ఆ తరువాత నిజంగానే ఆ యువకుడు కోలుకున్నాడట. అప్పటి నుంచి ఈ ప్రాంతంపై ప్రజలకు నమ్మకం పెరిగింది.

ఇవి కూడా చదవండి

వైద్యం చేసే విధానాన్ని పూజారి వివరిస్తూ.. వైద్యం కోసం ఆలయానికి వచ్చేవారి జుట్టుకు కూడా ముడి వేస్తారని తెలిపారు. నీటికి బదులు నెయ్యి, నల్లమిరయాలను ఉపయోగిస్తారని చెప్పాడు. ఈ ఆలయానికి రోజుకు 20-25 మంది రోగులు వస్తుంటారని చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..