Viral Video: వలలో చిక్కిన పది అడుగుల భారీ కొండచిలువ .. కొట్టి చంపిన యువకులు

Viral Video: వలలో చిక్కిన పది అడుగుల భారీ కొండచిలువ .. కొట్టి చంపిన యువకులు

Jyothi Gadda

|

Updated on: Sep 27, 2024 | 7:11 AM

స్థానిక ఏటిగట్టు వద్ద మొక్కలకు రక్షణగా వేసిన వలలో చిక్కుకుంది. దీంతో కొండచిలువను చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. భారీ కొండచిలువను చూసి వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. స్థానిక యువకులు భయంతో ఆ కొండచిలువపై దాడికి దిగారు..

కాకినాడ జిల్లా రామచంద్రపురంలో పది అడుగుల భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. స్థానిక ఏటిగట్టు వద్ద మొక్కలకు రక్షణగా వేసిన వలలో చిక్కుకుంది. దీంతో కొండచిలువను చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. భారీ కొండచిలువను చూసి వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. స్థానిక యువకులు భయంతో ఆ కొండచిలువపై దాడికి దిగారు..అంతా కలిసి కర్రలతో కొట్టి చంపారు. ఏలూరు కాల్వకు వరద నీరు భారీగా చేరడంతో కొండచిలువులు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Published on: Sep 27, 2024 07:09 AM