Buttermilk Hidden Facts: రోజు మజ్జిగ తాగితే కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుందో తెలిస్తే..!

సాధారణంగా చాలా మందికి నిద్రలేవగానే కాఫీ, టీలు తాగే అలవాటు ఉంటుంది. కానీ, ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు మజ్జిగ తాగితే ఏమవుతుందో తెలిస్తే ఇకపై ఇదే అలవాటుగా మార్చేసుకుంటారు.. ఎందుకంటే..మజ్జిగతో బోలెడన్నీ లాభాలు ఉన్నాయి. మజ్జిగ జీర్ణక్రియను పెంచుతుంది, క్యాలరీలను తగ్గిస్తుంది. రోజూ ఉదయం పరగడపున మజ్జిగ తాగడం వల్ల పొందే మరికొన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

|

Updated on: Sep 27, 2024 | 7:47 AM

మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు ఎంతో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మజ్జిగలో ఉండే గుణాలు ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేసి, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

1 / 5
రోజూ ఉదయం మజ్జిగ తాగడం వల్ల పొట్ట చల్లగా ఉంచి, కడుపులో మంట తగ్గిస్తుంది. అలాగే అసిడిక్ రిఫ్లెక్షన్ వల్ల పొట్టలో చీకాకును తొలగిస్తుంది. తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారాలు తీసుకున్న తర్వాత మజ్జిగ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు గుండెను కూడా ఆరోగ్యంగా చేస్తాయి.

2 / 5
వ్యాయామం చేసిన తర్వాత మజ్జిగ తాగడం వల్ల కండరాల నొప్పులు కూడా సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా మజిల్‌ బిల్డింగ్‌ చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ రోగ నిరోధక శక్తి కూడా సులభంగా పెంచుతుంది. దీని కారణంగా జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.

3 / 5
ముఖ్యంగా మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలను తొలగించేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. దీంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది.

4 / 5
వేసవిలో మజ్జిగ తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. దీంతో పాటు బాడీలో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు సహాయపడుతుంది.  మజ్జిగలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. కాబట్టి ఇది శరీరాన్ని హైడ్రేట్‌ చేసేందుకు సహాయపడుతుంది.

5 / 5
Follow us